రీహాబిలిటేషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యుడిగా డాక్టర్‌ లోకేశ్‌ లింగప్ప

కేంద్ర సామాజిక న్యాయ, సాధికార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో దివ్యాంగుల సంక్షేమం కోసం పనిచేసే రీహాబిలిటేషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యుడిగా హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ లోకేశ్‌ లింగప్ప నియమితులయ్యారు.

Published : 25 Jan 2024 04:20 IST

ఈనాడు, దిల్లీ: కేంద్ర సామాజిక న్యాయ, సాధికార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో దివ్యాంగుల సంక్షేమం కోసం పనిచేసే రీహాబిలిటేషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యుడిగా హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ లోకేశ్‌ లింగప్ప నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఈ కౌన్సిల్‌కు బుధవారం కొత్తగా 28 మంది సభ్యులను నియమించగా అందులో లోకేశ్‌ లింగప్పకు అవకాశం దక్కింది. వీరి కాలపరిమితి రెండేళ్లు ఉంటుంది. దివ్యాంగుల కోసం నిర్వహించే శిక్షణ కార్యక్రమాలు, రూపొందించే విధానాలను ఈ కౌన్సిల్‌ పర్యవేక్షిస్తుంది. డా.లోకేశ్‌ ప్రస్తుతం బంజారాహిల్స్‌ రెయిన్‌బో ఆసుపత్రిలో చైల్డ్‌ అండ్‌ అడోలెసెంట్‌ న్యూరాలజిస్ట్‌ కన్సల్టెంట్‌గా సేవలందిస్తున్నారు. కర్ణాటక మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌, చండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్‌లో పీజీ, బెంగళూరు నిమ్‌హాన్స్‌లో డీఎం న్యూరాలజీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని