వాలంటీర్ల ‘సాక్షి’ కొనుగోలుపై నేడు దిల్లీ హైకోర్టు విచారణ

ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల సాక్షి దినపత్రిక కొనుగోలు వ్యవహారంపై తదుపరి విచారణను దిల్లీ హైకోర్టు బుధవారం చేపట్టనుంది.

Published : 27 Mar 2024 03:58 IST

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల సాక్షి దినపత్రిక కొనుగోలు వ్యవహారంపై తదుపరి విచారణను దిల్లీ హైకోర్టు బుధవారం చేపట్టనుంది. ఈ కేసులో ఈ నెల 14న జరిగిన విచారణలో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. తదుపరి విచారణ తేదీ వరకు తెలుగు దినపత్రికల సర్క్యులేషన్‌ గణాంకాలను విడుదల చేయొద్దని ‘ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ సర్క్యులేషన్‌ (ఏబీసీ)’ను ఆదేశించింది. ఆ వివరాలను తమకు సీల్డ్‌ కవరులో అందజేయాలని సూచించింది. అనంతరం- ఉషోదయా పబ్లికేషన్స్‌ వినతి మేరకు ఈ నెల 14 నాటి ఉత్తర్వుల్లోని ‘సర్వే’ అనే పదాన్ని ‘సర్క్యులేషన్‌ ఆడిట్‌’గా మార్పు చేస్తూ 22న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని