ఆర్థిక ప్రణాళిక పక్కాగా..

అమలకొచ్చే జీతం సర్దుకుంటే సరిపోతుంది. అనవసర ఖర్చులను తగ్గించుకోలేకపోవడంతో నెలాఖరుకి ఆమె చేతిలో పైసా ఉండదు. ఆదాయం సరిపోయేలా జాగ్రత్తపడటంకన్నా, ఆర్థికపరమైన ఖర్చుల్లో చేసే పొరపాట్లే అప్పులబారిన పడేలా చేస్తాయంటున్నారు నిపుణులు.

Published : 27 Jan 2023 00:23 IST

అమలకొచ్చే జీతం సర్దుకుంటే సరిపోతుంది. అనవసర ఖర్చులను తగ్గించుకోలేకపోవడంతో నెలాఖరుకి ఆమె చేతిలో పైసా ఉండదు. ఆదాయం సరిపోయేలా జాగ్రత్తపడటంకన్నా, ఆర్థికపరమైన ఖర్చుల్లో చేసే పొరపాట్లే అప్పులబారిన పడేలా చేస్తాయంటున్నారు నిపుణులు. ఇలాకాకుండా ఉండాలంటే పాటించాల్సిన సూచనలు,సలహాలను చెప్పుకొస్తున్నారిలా..

దాయాన్ని అవసరాలకు తగ్గట్లు వినియోగించడంలో సరైన ఆర్థిక ప్రణాళికను పాటించాలి. జీతంకన్నా ఎక్కువ ఉండే వ్యయాన్ని నియంత్రించుకోగలగాలి. ఏయే చోట్ల ఎక్కువ ఖర్చు అవుతుందో గుర్తించి, వాటి అవసరమెంతుందో ఆలోచించి ఆచితూచి అడుగులేయాలి. ముందుగానే కుటుంబం, పిల్లల ఖర్చులు, వ్యక్తిగతం అంటూ ఒక బడ్జెట్‌ వేసుకోవాలి. వీటితోపాటు పండుగలు, ప్రత్యేకదినాలు, అనారోగ్యాలు సహా అత్యవసర ఖర్చులు, భవిష్యత్తు అవసరాలనూ దృష్టిలో ఉంచుకోవాలి. రిటైర్‌మెంట్‌ తర్వాత కావాల్సిన ఫండ్‌నూ ఇప్పటి నుంచే పొదుపు చేయాలి. వీటన్నింటినీ సమన్వయం చేయడానికి ప్రస్తుతం చాలారకాల ఆన్‌లైన్‌ ఫోరమ్స్‌ చేయూతగా నిలుస్తున్నాయి.

ఖర్చులను.. రెండుమూడు నెలలు ఖర్చుపెట్టే ప్రతిపైసాను ఒక పుస్తకంలో రాయాలి. అలాగే ఫోన్‌ యాప్‌ లేదా వెబ్‌సైట్‌ ద్వారా కూడా ఈ వివరాలను పొందుపరిస్తే, నెలంతా దేనికి ఎంత ఖర్చుపెట్టామో తెలుస్తుంది. రెండు నెలల తర్వాత అవసరం, అనవసరం అని రెండుగా వీటిని విడదీస్తే, ఎక్కడ నగదు వృథా అవుతోందో గుర్తించొచ్చు. రవాణా, బయటి ఆహారం, ఎంటర్‌టైన్‌మెంట్‌, మితిమీరిన షాపింగ్‌ వంటి ఖర్చులు తెలుస్తాయి. అవసరం కాని వాటిని నియంత్రించి, మరో ముఖ్యమైన పొదుపు కోసం కేటాయిస్తే మంచిది.

దూరంగా.. క్రెడిట్‌ కార్డుపై అందించే రుణాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ఎలక్ట్రానిక్‌ వస్తువుల కొనుగోలులో తప్పనిసరై క్రెడిట్‌కార్డ్‌ను  వినియోగించినా, వీలైనంత తక్కువకాలంలో చెల్లించాలనే లక్ష్యం పెట్టుకొని ప్రయత్నించాలి. అలాగే ఒకేసారి రెండు మూడు రుణాలు తీసుకోవద్దు. అప్పుడు భారమనిపించదు. తిరిగి కట్టడం తేలిక అవుతుంది. తక్కువ సమయంలోనూ చెల్లించేయొచ్చు. వడ్డీ, చెల్లించే కాలం వంటివాటిలో ఏది అనువైనదో సలహా లేదా ప్రణాళిక అవసరమైనప్పుడు ఫైనాన్షియల్‌ ప్లానర్‌ లేదా క్రెడిట్‌ కౌన్సెలర్‌ను అడిగి తెలుసుకొంటే మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్