పోల్చుకోవడం మంచిది..

ప్రియాంక నాలుగేళ్లగా ఓ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఓ స్నేహితురాలు తాను పనిచేస్తున్న సంస్థ గురించి చెప్పి, అక్కడ ప్రయోజనాలెక్కువున్నాయంది. కొత్త సంస్థలోకి అడుగుపెట్టాలనే ఆలోచన ఉంటే కొన్ని అంశాలను తప్పనిసరిగా పరిశీలించి,

Updated : 28 Apr 2022 06:31 IST

ప్రియాంక నాలుగేళ్లగా ఓ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఓ స్నేహితురాలు తాను పనిచేస్తున్న సంస్థ గురించి చెప్పి, అక్కడ ప్రయోజనాలెక్కువున్నాయంది. కొత్త సంస్థలోకి అడుగుపెట్టాలనే ఆలోచన ఉంటే కొన్ని అంశాలను తప్పనిసరిగా పరిశీలించి, పోల్చి చూసుకోవాలంటున్నారు కెరియర్‌ నిపుణులు.

అనుభవానికి.. కొన్ని సంస్థల్లో ఏళ్ల తరబడి పని చేసినా, వేతనం పెరగదు. కొన్నిసార్లు పదోన్నతులనూ మర్చిపోవాల్సిందే. అనుభవమెంతున్నా.. పరిస్థితి ఇంతే. దీంతో సంస్థ మారాలనుకోవడం సహజమే. అయితే పాత, కొత్త సంస్థలు అందించే ప్రయోజనాలను పోల్చి చూసుకున్నాకే ముందడుగు వేయాలి. భవిష్యత్తులో ఉన్నతస్థాయికి చేరుకునే అవకాశాలు ఎంతవరకూ ఉన్నాయో పరిశీలించాలి. అదనపుపని, నేర్చుకోవడానికి ఉన్న అవకాశాలు తెలుసుకోవాలి. అక్కడి ఉద్యోగుల అభిప్రాయాలు, అనుభవాలు, వేతనాలతోపాటు వారందుకున్న పదోన్నతులపై స్పందనలను ఆ సంస్థ వెబ్‌సైట్‌ నుంచి తెలుసుకోవాలి.

ఇతర ప్రయోజనాలు.. ఉద్యోగబాధ్యతల్లో భాగంగా ప్రాజెక్టులపై ఇతర ప్రాంతాలకెళ్లడంపై మీకు ఆసక్తి ఉంటే, అక్కడ ఆ అవకాశాలున్నాయో లేదో చూసుకోవాలి. అందుకు అభ్యర్థుల నుంచి ఏం ఆశిస్తున్నారో గమనించుకోవాలి. ఆరోగ్య బీమా, పీటీఓ (పెయిడ్‌ టైమ్‌ ఆఫ్‌) వంటి వాటికున్న నియమాలనూ తెలుసుకోవాలి. సెలవుల విధానాలు ప్రతి సంస్థకూ మారుతుంటాయి. ఏటా అందించే బోనస్‌ పద్ధతి కూడా గమనించుకోవాలి.

ఎదుగుదల... కెరియర్‌లో ఎదుగుదల అత్యంత ముఖ్యం. కొత్త సంస్థకు మారిన తర్వాత పొరపాటు చేశాననే ఆలోచన రాకుండా ఉండాలంటే అక్కడి విధివిధానాలు, నియమాలను ముందుగానే తెలుసుకోవడం మంచిది. బాధ్యతలను విజయవంతంగా పూర్తిచేయడాన్ని ఆధారంగా చేసుకొని కొన్నిచోట్ల పదోన్నతులుంటాయి. రెండు సంస్థలనూ ఈ అంశంలో పోల్చడం తప్పనిసరి. ఎందుకంటే పొందిన స్థానం, అనుభవం భవిష్యత్తులో మరింత ఎదగడానికి దోహదపడతాయి. అలాగే ఏటా సంస్థ ఎదుగుదల తీరునూ గమనించుకోవాలి. ఆ తర్వాతే ఉద్యోగం మారాలా వద్దా అనేదానిపై నిర్ణయం తీసుకోవాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్