కోపమొచ్చిందా?

పిల్లలు తప్పు చేసినా, ఆయనగారు ఏదైనా తేవడం మర్చిపోయినా కోపం సహజమే. చాలాసార్లు తమాయించుకున్నా కొన్నిసార్లు అరిచో, అలిగో పోగొట్టుకుంటాం. మరి ఆఫీసులో అలా కుదరదు కదా! మరేం చేయాలి? కోపం పెంచుకుంటే మనకే అనర్థం అనుకొని చాలా సార్లు సర్దుకుపోతుంటాం. కానీ మీరు సవ్యంగా పని చేసినా కొన్ని నిర్ణయాల్లో అసమానత్వం చూపినా.. మీరు పనికిరారు అన్నట్లుగా ప్రవర్తించినా.. ఆ...

Updated : 10 May 2022 06:13 IST

పిల్లలు తప్పు చేసినా, ఆయనగారు ఏదైనా తేవడం మర్చిపోయినా కోపం సహజమే. చాలాసార్లు తమాయించుకున్నా కొన్నిసార్లు అరిచో, అలిగో పోగొట్టుకుంటాం. మరి ఆఫీసులో అలా కుదరదు కదా! మరేం చేయాలి?

కోపం పెంచుకుంటే మనకే అనర్థం అనుకొని చాలా సార్లు సర్దుకుపోతుంటాం. కానీ మీరు సవ్యంగా పని చేసినా కొన్ని నిర్ణయాల్లో అసమానత్వం చూపినా.. మీరు పనికిరారు అన్నట్లుగా ప్రవర్తించినా.. ఆ కోపం సమంజసమే. అలాగని దాన్ని వేరే వారిపై చూపించొద్దు. చూసీ చూడనట్లూ వెళ్లొద్దు. ఉదాహరణకు- ఫలానా పని చేసిందేమో మీరు.. దాని క్రెడిట్‌ వేరేవారు తీసుకున్నారనుకోండి. దాని లోతుపాతులు మీకే తెలుస్తాయి. ఆ పని, కొనసాగింపు వివరాలేమైనా ఉంటే.. ఫలానా వ్యక్తిపై ఫిర్యాదు చేసినట్లుగా కాక.. పై అధికారితో దాని గురించి వివరించండి. వాళ్లకి పరిస్థితి అర్థమవుతుంది.

పైవాళ్ల మీదే కోపమొచ్చిందనుకోండి. తోటివారితో చెప్పుకొనో, అసహనాన్ని వ్యక్తం చేసో భారాన్ని దింపుకుంటాం. ఇది అస్సలు మంచిది కాదు. వాళ్లకి ఏదైనా దురుద్దేశం ఉంటే.. కొత్త సమస్యలు వస్తాయి. ఆఫీసు ప్రాంగణం నుంచి ఇంట్లో వాళ్లతోనూ ఈ విషయాలు మాట్లాడొద్దు. బదులుగా మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టండి. మరీ ఇబ్బందిగా ఉంటే హెచ్‌ఆర్‌ విభాగాన్ని కలవండి.

నిజంగానే కోపంలో అర్థముందా? దీన్నీ చెక్‌ చేసుకోండి. చాలాసార్లు.. కోపం, భయాలకు గత సంఘటనలూ, అనుభవాలూ కారణమవొచ్చు. కాబట్టి.. మీకెందుకు కోపం వచ్చింది? తెప్పించిన మాటేంటి? లాంటివి గమనించుకోండి. అవసరమైతే స్నేహితులతోనూ చర్చించండి. అనవసరంగా కోపం వచ్చిందని అనిపిస్తే మానసిక ఆరోగ్యం, ఒత్తిడిలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

ఒక్కోసారి అకారణంగా మాట పడ్డం వల్లా కోపం వస్తుంటుంది. అవతలి వ్యక్తీ తెలియక చేస్తుండొచ్చు. అప్పుడు వాళ్లతోనే ‘మీరు దేనికో కోపంగా ఉన్నారు. కానీ దాన్ని మీరు నామీద చూపిస్తోంటే... నా పని సరిగా చేయలేకపోతున్నా’ అని నేరుగానే చెప్పేయండి. పరిస్థితిలో మార్పు తప్పక వస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్