సకాలంలో నిర్ణయం సామర్థ్యానికి నిదర్శనం

ఆఫీస్‌లో ఉద్యోగుల ఎంపికలో అమల చేసే తాత్సారంతో సంస్థకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇలా నిర్ణయం తీసుకోవడానికి గంటలూ, రోజులు  వెచ్చిస్తే, అది స్థాయిని తగ్గించడమే  కాదు, ఉద్యోగానికే ప్రమాదం కలిగిస్తుందంటున్నారు నిపుణులు. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు వేసే ప్రతి అడుగూ అప్రమత్తంగా ఉండాలి. అంతే వేగంగానూ.. అడుగు లేయాలి. ఎక్కువ సమయాన్ని వృథా కానివ్వకుండా

Published : 18 Jul 2022 00:37 IST

ఆఫీస్‌లో ఉద్యోగుల ఎంపికలో అమల చేసే తాత్సారంతో సంస్థకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇలా నిర్ణయం తీసుకోవడానికి గంటలూ, రోజులు  వెచ్చిస్తే, అది స్థాయిని తగ్గించడమే  కాదు, ఉద్యోగానికే ప్రమాదం కలిగిస్తుందంటున్నారు నిపుణులు.

ద్యోగ బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు వేసే ప్రతి అడుగూ అప్రమత్తంగా ఉండాలి. అంతే వేగంగానూ.. అడుగు లేయాలి. ఎక్కువ సమయాన్ని వృథా కానివ్వకుండా విలువైన నిర్ణయాన్ని అందించాలి. అప్పుడే సామర్థ్యం ఉన్న ఉద్యోగిగా పేరు పొందొచ్చు. విధుల్లోనూ నిరూపించుకోవచ్చు. ఉద్యోగులను ఎంపిక చేసే మేనేజర్‌ స్థాయిలో మీరున్నప్పుడు అర్హతతోపాటు నైపుణ్యాలున్న వారిని తేలికగా గుర్తించి వారిని చేర్చుకోవడంలో ఆలస్యం చేయకూడదు. వేగంగా ఆలోచిస్తూ, అవతలి వారి సామర్థ్యాలను వెంటనే గుర్తించగలిగేలా ఉంటేనే మీవల్ల సంస్థకు ప్రయోజనమెక్కువ.

ఆలోచనలో... సమయానికి తగినట్లుగా, విశ్లేషణాత్మకంగా అలాగే వ్యూహాత్మకంగా ఆలోచించడం నేర్చుకోవాలి. కొత్తగా చేపట్టే ప్రాజెక్టును తీసుకోవాలా వద్దా అనే అధికారం మీకిచ్చినప్పుడు వీలైనంత త్వరగా  నిర్ణయం చెప్పగలగాలి. ఆ అంశంపై కూలంకషంగా పరిశోధన చేస్తే పూర్తిగా అవగాహన పొందొచ్చు. దీంతో ధైర్యంగా ముందడుగు వేయొచ్చు. అలాగే బృందంతో కలిసి ఆలోచించడం మంచిది. ఎందుకంటే ఈ ప్రాజెక్టును వాళ్లతోనే కలిసి చేయాల్సి ఉంటుంది. అందుకే వారేం చెబుతున్నారో వినాలి. మీ అభిప్రాయమే కాకుండా, కొన్ని చోట్ల  సహచరుల అభిప్రాయాల్నీ, ఆలోచనల్నీ తీసుకుంటూ ఉండాలి. ఏదైనా అంశంపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాల్సినప్పుడు గడువుని నిర్దేశించుకోవాలి.   దాని ప్రకారం ఓ ప్రణాళిక వేసుకోవాలి. సంస్థకు సంబంధించి బయట నుంచి ఏదైనా ఆర్డరు తీసుకోవాల్సినప్పుడు దాని వల్ల ప్రయోజనాలు ఎక్కువా, తక్కువా అని వేగంగా తెలుసుకోవాలి. లేదంటే ఆ తర్వాత ఆర్డరు దొరకకపోవచ్చు. దీనివల్ల సంస్థకు నష్టం రావొచ్చు. ఇటువంటప్పుడు ఆ ఆర్డరు ఎంతవరకు ఉపయోగపడుతుందో గుర్తించగలగాలి. దీనికి నిపుణులతో చర్చించాలి. మీ బృందంతో మాట్లాడి, మీ నిర్ణయాన్ని త్వరగా చెప్పగలగాలి. అప్పుడే సామర్థ్యం, వేగంగా ఆలోచించగలిగే నైపుణ్యాలు అలవడతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్