ఉద్యోగం మారాలనుందా?

ఒక సంస్థలో చేరి పదవీ విరమణ దాకా వేచి ఉండే రోజులు కావివి. మెరుగైన అవకాశాలు, పెరిగే హోదా, మెచ్చిన సంస్థ.. వివిధ కారణాలతో ఉద్యోగాలు మారుతున్న అమ్మాయిలూ ఎందరో! అయితే ప్రయత్నించే ముందు వీటిని గమనించుకోవడం మాత్రం తప్పనిసరి.

Published : 26 Jul 2022 02:42 IST

ఒక సంస్థలో చేరి పదవీ విరమణ దాకా వేచి ఉండే రోజులు కావివి. మెరుగైన అవకాశాలు, పెరిగే హోదా, మెచ్చిన సంస్థ.. వివిధ కారణాలతో ఉద్యోగాలు మారుతున్న అమ్మాయిలూ ఎందరో! అయితే ప్రయత్నించే ముందు వీటిని గమనించుకోవడం మాత్రం తప్పనిసరి.

* మారాలనుకుంటున్న విషయాన్ని ముందు స్నేహితులకు, తెలిసినవారికి చెప్పండి. అవకాశాల విషయాలు నెట్‌వర్క్‌ కంటే మెరుగ్గా ఎవరికీ తెలియదు. రిఫరెన్స్‌ దొరికితే పని ఇంకాస్త తేలికవుతుంది.

* ఖాళీల విషయాలు తెలుసనుకోండి.. దరఖాస్తులో రెజ్యూమెది ప్రధానమని తెలిసిందేగా! గత అనుభవాన్ని తప్పక చేరుస్తారు కదా. అప్లై చేసే హోదాకి కొన్ని సరిపడకపోవచ్చు లేదా అనవసరం అయ్యుండొచ్చు. అలాంటివాటిని తీసేయడమే మంచిది. అలాగని అవి తర్వాతా పనికిరావని కాదు. కాబట్టి, అసలు దాన్ని పక్కనపెట్టి కొత్తగా మరొకటి సిద్ధం చేసుకొని దాన్ని పంపితే సరిపోతుంది.

* ఆన్‌లైన్‌ దరఖాస్తులో కొన్ని సంస్థలు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కోరుతుంటాయి. చాలాసార్లు అప్పటికి ఏది తోస్తే దాన్ని రాసేస్తుంటాం. ఇంటర్వ్యూ కొచ్చేసరికి మర్చిపోయే అవకాశముంది. సమాధానంలో తేడా ఉంటే రెండు ధోరణులున్న వ్యక్తిగా లేదా సీరియస్‌నెస్‌ లేదనే పేరు ఏర్పడొచ్చు. కాబట్టి, ఏమేం రాశారో వాటన్నింటినీ విడిగా ఒక టెక్ట్స్‌ డాక్యుమెంట్‌లో కాపీ చేసుకొని ఉండటం మంచిది. ఇంటర్వ్యూ సమయానికి రిఫరెన్స్‌గా పనికొస్తాయి.

* పనిలో భాగంగా ఎన్నో ప్రాజెక్టులు చేస్తుంటాం. వాటిలో పేరు, గుర్తింపు తెచ్చేవీ ఉంటాయి. వాటిని చెప్పమంటే ఒకటో రెండో చెబుతుంటాం. ఒక్కోసారి అవి చేరబోయే హోదాకి సరిపడేవి కాకపోవచ్చు. కానీ గతంలో మీరు దానికి తగ్గవి చేసున్నా సమయానికి గుర్తు రాకపోవచ్చు. కాబట్టి ఆలోచించి వాటిని ఒక జాబితాగా రాసుకొని ఉంచుకోండి. రెజ్యూమెలోనూ చేర్చండి. తర్వాత దీన్నో పనిలా కొనసాగిస్తే మెదడులో నిక్షిప్తమవుతాయి. భవిష్యత్‌లోనూ ఉపయోగపడతాయి.

* కొన్ని సంస్థలు దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేశాక ఉద్యోగ బాధ్యతలు, ఆశిస్తున్న విషయాలను తొలగించేస్తాయి. ఇంటర్వ్యూకు సిద్ధమవడానికేమో ఇవి తప్పనిసరి. వెతికితేనేమో దొరకవు. కాబట్టి, ముందుగానే వాటినీ కాపీ చేసి ఉంచుకోవడం మేలు. అలాగే కీవర్డ్స్‌ను జత చేయడం మర్చిపోవద్దు. అప్పుడే ఇంటర్వ్యూ అవకాశాలు మెరుగవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్