ఇలా చేస్తే.. ఆటంకాలుండవు!

ఎప్పుడూ ఆరోజు పనిపైనే దృష్టిపెట్టకండి. అక్కడే ఆగిపోతారు. కెరియర్‌ పరంగా ఏం కోరుకుంటున్నారో ఆలోచించండి. దానిప్రకారం ఆరు నెలలు, ఏడాదిలో సాధించాల్సిన వృత్తి, వ్యక్తిగత లక్ష్యాలను నిర్దేశించుకోండి. అందుకు రోజు,

Published : 28 Jul 2022 01:57 IST

* ఎప్పుడూ ఆరోజు పనిపైనే దృష్టిపెట్టకండి. అక్కడే ఆగిపోతారు. కెరియర్‌ పరంగా ఏం కోరుకుంటున్నారో ఆలోచించండి. దానిప్రకారం ఆరు నెలలు, ఏడాదిలో సాధించాల్సిన వృత్తి, వ్యక్తిగత లక్ష్యాలను నిర్దేశించుకోండి. అందుకు రోజు, నెలవారీగా వేటిపై దృష్టిపెట్టాలో జాబితా రాసుకుని చెక్‌ చేసుకుంటూ ఉండండి. పని మొదలుపెట్టే ముందు ఆరోజు చేయాల్సిన పనులను ఓ కాగితంపై రాయండి. పూర్తి చేసిన దాన్ని టిక్‌ చేసుకుంటూ ఉండండి. ఆరోజు పనీ పూర్తవుతుంది. లక్ష్యమూ గుర్తుకొస్తుంటుంది.

* ఇవన్నీ రోజూ వేటిపై ఫోకస్‌ చేయాలన్న దానిపై స్పష్టతనిస్తాయి. వాటన్నింటిపై ఒక్కసారిగా పట్టు తెచ్చుకోవడం కాస్త కష్టమే. అందుకే ముఖ్యమైన వాటిని ఎంచుకోండి. వాటిని తరచూ మననం చేసుకోవాలి. ప్రతి పనిలో వాటిని గమనించుకున్నారో లేదో చెక్‌ చేసుకోవాలి. అప్పుడు అది అలవాటుగా మారుతుంది.

* పని అనగానే భారంగా తోస్తుంది. దీంతో పూర్తిచేయడం చాలా కష్టమనిపిస్తుంది. దాన్నో ఆటగా, సృజనాత్మకతను చూపే మార్గంగా భావించండి. అంటే.. దీన్ని గంటలో పూర్తిచేస్తా చూడని మీకు మీరే సవాలు విసురుకోవాలి. ఇంకాస్త భిన్నంగా ఎలా చేయొచ్చు అని ఆలోచించడం లాంటివి చేయండి. కొత్త ఉత్సాహం వస్తుంది. చేస్తున్నదాన్ని ప్రేమించడం, కొత్తగా చేయాలని ప్రయత్నించడం.. మిమ్మల్ని ప్రత్యేకంగా నిలిపే అంశాలే.

* ఎంత ప్రయత్నించినా ఒక్కోరోజు మనసు లగ్నమవదు. అయినా మొండిగా మొదలు పెడతాం. పనేమో సాగదు. ఫలితమే చిరాకు. మొదలుపెట్టే ముందే మనసు ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోండి. ఆకలి, సరిగా నిద్రపోకపోవడం, నలతగా ఉండటం వంటివేమైనా కనిపిస్తే తగ్గట్టుగా ఏం చేయాలో చూసుకోండి. అంటే ఏదైనా తినడం, కాసేపు పక్కకు వెళ్లి టీ తాగడమో, విశ్రాంతి తీసుకోవడమో, ధ్యానం వంటి వన్నమాట. మిమ్మల్ని సెకన్లలో ఉత్సాహంతో నింపేదేంటో తెలుసుకొని ప్రయత్నించినా మంచిదే. కొన్నిసార్లు ఆఫీసులో స్నేహితులు కరవవ్వడమూ విసుగు పుట్టించేదే. అలాంటిదేమైనా ఉంటే నెట్‌వర్కింగ్‌పై దృష్టిపెట్టాలని అర్థం. పనికే పరిమితమవ్వక మాటలు కలపడం, ఆలోచనలు కలిసే వారితో చిన్న చిన్న సంభాషణలూ పనిపై శ్రద్ధ పెంచేవే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్