సమయానికి తగినట్లు...

నిత్య చదువులో ముందంజలో ఉండేది. మంచి ర్యాంకు, అయిదంకెల జీతంతో ఉద్యోగాన్ని సంపాదించింది. తీరా అక్కడ ఇమడలేక ఆఫీస్‌కి వెళ్లాలంటేనే ఆసక్తి లేనట్లు మారింది. పరిస్థితులను అర్థం చేసుకొని సందర్భానికి, సమయానికి

Published : 25 Sep 2022 02:22 IST

నిత్య చదువులో ముందంజలో ఉండేది. మంచి ర్యాంకు, అయిదంకెల జీతంతో ఉద్యోగాన్ని సంపాదించింది. తీరా అక్కడ ఇమడలేక ఆఫీస్‌కి వెళ్లాలంటేనే ఆసక్తి లేనట్లు మారింది. పరిస్థితులను అర్థం చేసుకొని సందర్భానికి, సమయానికి తగినట్లుగా అడుగులేసే మానసిక పరిణతి (ఎమోషనల్‌ ఇంటలిజెన్స్‌) కొరవడటమే దీనికి కారణమంటున్నారు నిపుణులు.

చదువు ద్వారా మంచి కెరియర్‌లో స్థిర పడొచ్చు. పరిణితి ఉంటే ఎక్కడైనా, ఎవరి మధ్యనైనా జీవించగలిగే సామర్థ్యాన్ని పొందొచ్చు. పరిణతి పలు అంశాలతో ముడిపడి ఉంటుంది. మొదటగా స్వీయ అవగాహన... అంటే మన లక్ష్యాలు, భావోద్వేగాలు, బలాలు, బలహీనతలపై పూర్తి అవగాహన ఉండాలి. ఆ తర్వాత స్వీయ నిర్వహణ అంటే... సందర్భాన్ని బట్టి స్పందించడం, మన సామర్థ్యాలను బయట పెట్టడం, సమయాన్ని సరిగ్గా వినియోగించు కోవడం అలవడతాయి. 

అవగాహన..

మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని గుర్తించగలగాలి. ఈ సామాజికపరమైన అవగాహనతో ఇతరుల భావోద్వేగాలు అర్థమవుతాయి. వాటికి తగినట్లుగా అడుగు లేయాలి. అలాగే ఇతరులతో బంధాలను కాపాడుకొనే నైపుణ్యం తెచ్చుకోవాలి. సానుకూల ఆలోచనావిధానాన్ని అలవరుచుకోవాలి. ఇతరుల సామర్థ్యాలనూ గుర్తించగలగాలి. సమస్య వచ్చినప్పుడు మనవైపు నుంచే కాక అవతలి వారి కోణం నుంచి కూడా ఆలోచించగలగాలి. ఎదుటివారు చెప్పేది పూర్తిగా వినడం తెలిసినప్పుడే టీం లీడర్‌గా స్థానాన్ని సంపాదించడమే కాదు, ప్రతి ఒక్కరికీ బాధ్యత తెలుపుతూ.. స్ఫూర్తిదాయకంగా ఎదుగుతాం.

నేర్చుకోవాలి..

సహోద్యోగుల ప్రత్యేకతలను గుర్తించాలి. వారి నుంచి కొత్త విషయాల్ని నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అన్నీ నాకు తెలుసనే ఆలోచన మంచిది కాదు. ఎప్పటికప్పుడు నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవారే మానసిక పరిణతి సాధించగలరు. ఎదుటివారు తమ అభిప్రాయాలను చెబుతున్నప్పుడు వాటికి మర్యాదనివ్వాలి. వాటి వల్ల సరైన ఫలితాలు లేకపోతే మన అభిప్రాయాన్ని కూడా సున్నితంగా చెప్పగలిగే స్వీయ నియంత్రణ ఉండాలి. మన బలహీనతలను బలాలుగా మార్చుకోవడానికి కృషి చేయకపోతే అపజయమే ఎదురవుతుంది. ఉద్యోగ బాధ్యతలను స్వీకరించి పూర్తిచేయడానికి సామర్థ్యాలను పెంచుకుంటూ ఉంటే, మరెన్నో కొత్తపాఠాలను నేర్చుకోవచ్చు. కెరియర్‌లో విజయాలు సాధించొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్