ప్రశ్నలు కావవి.. సమస్యలు..

అమల ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేక, ఎంపిక కాలేకపోయింది.

Updated : 30 Sep 2022 02:52 IST

అమల ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేక, ఎంపిక కాలేకపోయింది. కొన్ని ఇంటర్వ్యూలలో గత ఉద్యోగంలో ఎదురైన సమస్యలు ఈసారి ప్రశ్నలుగా మారతాయి. వాటిని అభ్యర్థి ఎలా పరిష్కరించారన్న దాని ఆధారంగా ఎంపిక జరుగుతుంది. గత అనుభవాల ద్వారా పొందిన నైపుణ్యాలే కొత్త ఉద్యోగానికి అర్హతలవుతాయంటున్నారు నిపుణులు.

అభ్యర్థిలోని నైపుణ్యాలను గుర్తించడానికి కొన్ని చోట్ల బిహేవియరల్‌ ఇంటర్వ్యూ ప్రశ్నలు ఎదురవుతాయి. ఆయా సందర్భాల్లో అభ్యర్థి స్పందన, పరిష్కరించిన విధానాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తారు. అందుకే ప్రశ్న అర్థం చేసుకోవాలి. గతంలో ఎదురైన సమస్యను ఎలా దూరం చేయగలిగారో విడమర్చి చెప్పాలి. అందులో నిజాయతీ ఉండాలి. ఏమాత్రం నిజం లేకపోయినా.. ఆ తర్వాత వెరిఫికేషన్‌లో తెలిసిపోతుంది. అది ఉద్యోగ భవిష్యత్తుకు మచ్చలా మారే ప్రమాదం ఉంది.  

ఇలా ఉండొచ్చు..

ఓ బృందంలో సభ్యులుగా పని చేస్తున్నప్పుడు ఎటువంటి సంఘర్షణ ఎదుర్కొన్నారు, దాంట్లోంచి ఎలా బయటకొచ్చి ‘మీ బాధ్యతలు సరిగా నిర్వర్తించారా’ అనే ప్రశ్న అడిగారనుకోండి... వెంటనే సహోద్యోగుల మీద ఫిర్యాదులు చెప్పకూడదు. అలాగని మీ గురించి మీరే గొప్పగానూ మాట్లాడకూడదు. ప్రాజెక్టుకు కేటాయించిన సమయం మించిపోతున్నప్పుడు తీవ్ర ఒత్తిడి కలిగిన మాట వాస్తవమే అయినా.. అందరికీ పని పూర్తి చేయాలన్న బాధ్యతను గుర్తుచేసి, ప్రోత్సహించి విజయవంతంగా పూర్తిచేసిన విధానాన్ని వివరించాలి. ఆ తర్వాత వచ్చిన ప్రశంసలన్నీ మీవే అన్నట్లు కాకుండా, అది అందరి కృషికీ ఫలితం అంటే చాలు. ఆ విజయంలో, కృషిలో మీ భాగస్వామ్యాన్ని,  మీ నైపుణ్యాల్ని గుర్తిస్తారు.

కెరియర్‌లో..

గత ఉద్యోగ బాధ్యతల్లో ఏదైనా అత్యంత క్లిష్టమైన సమస్య నెదుర్కొన్నారా.. దాన్ని ఎలా దాటగలిగారని అడిగితే సమాధానం తప్పనిసరి. ఓసారి ఊహించని విధంగా క్లైంట్‌ తన ఆలోచన మార్చుకోవడంతో అప్పటి వరకు చేసిన మీ ప్రాజెక్టు వృథా అయ్యే సందర్భం ఎదురైతే దాన్ని తిరిగి ఉపయోగపడేలా ఎలా చేశారో వివరించాలి. క్లైంట్‌తో చర్చించి మొత్తం ప్రాజెక్టు రద్దు చేయకుండా, తనకు కావాల్సిన విధంగా ఎలాంటి మార్పులు చేర్పులు చేసి అందించారన్నది విడమర్చి చెప్పాలి. లేదంటే అది మీ కెరియర్‌ను ప్రభావితం చేసి ఉండేదని నిజాయతీగా వివరించాలి. మీరు చెప్పే విధానమే అవతలివారిని మెప్పిస్తుంది. ఆ క్లిష్టమైన సందర్భంలో  క్లైంట్స్‌ను ఒప్పించగలిగిన మీ చాతుర్యమే కొత్త ఉద్యోగానికీ  అర్హత కల్పిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్