కెరియర్‌లో స్పష్టత లేకపోతే..

సుకన్య ఒక లక్ష్యం లేకుండానే డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత ఏం చేయాలి, ఉద్యోగం కోసం తదుపరి కోర్సు ఏం చదవాలి, తనకు నచ్చిన రంగమేంటి వంటి సందేహాలు తనను అయోమయానికి గురి చేస్తున్నాయి.

Updated : 11 Oct 2022 08:47 IST

సుకన్య ఒక లక్ష్యం లేకుండానే డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత ఏం చేయాలి, ఉద్యోగం కోసం తదుపరి కోర్సు ఏం చదవాలి, తనకు నచ్చిన రంగమేంటి వంటి సందేహాలు తనను అయోమయానికి గురి చేస్తున్నాయి. ఇలా కెరియర్‌ ఎంచుకునే విషయంలో స్పష్టత లేకపోతే కౌన్సెలింగ్‌ తప్పనిసరి అంటున్నారు నిపుణులు.

డిగ్రీ వరకు, ఆ తర్వాత ప్రణాళిక లేకుండా సాగి, ముందుకు ఎలా వెళ్లాలో కొందరికి అర్థంకాదు. మరికొందరికి తమకిష్టమైనది ఏ అంశం అనేది కూడా తెలియదు. ఎదుట ఎన్నో రకాల కోర్సులు, అవకాశాలు చూస్తున్నప్పుడు ఎటు వెళ్లాలో నిర్ణయించుకోలేరు. ఇటువంటప్పుడే కౌన్సెలింగ్‌ తీసుకోవడం మంచిది. కెరియర్‌లో స్పష్టతను తెచ్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కెరియర్‌ కౌన్సెలర్లు ఎదుటివారిలోని ఆసక్తి మాత్రమే కాదు, ఎందులో వారికి నైపుణ్యాలున్నాయో కూడా గుర్తిస్తారు. వాటిని ఆధారంగా చేసుకొని ఎటువంటి కెరియర్‌ను ఎంచుకోవాలో సలహాలూ, సూచనలిస్తారు. చదువులో మాత్రమే కాదు, ఉద్యోగం, వ్యాపారంతోపాటు జీవితానికి సంబంధించిన నిర్ణయాల్లోనూ అస్పష్టతను దూరం చేస్తారు.


సూచించి..

ఆసక్తి ఉన్న కోర్సు పూర్తిచేసిన తర్వాత ఆయా రంగాల్లో అవకాశాలు లేవన్న సమయంలో కెరియర్‌ కౌన్సెలర్లు చేయూతనందిస్తారు. ఆ కోర్సులో చేరేటప్పుడు అవకాశాలుండొచ్చు. తీరా రెండుమూడేళ్లకు ఆ రంగం కుదేలుకావొచ్చు. అంతమాత్రాన నిరుత్సాహపడాల్సిన అవసరంలేదు. అనుబంధ రంగాల్లో ప్రయత్నించొచ్చు. లేదా ఆ కోర్సుకు అనుబంధ కోర్సు జతచేస్తే మంచి ఉద్యోగ అవకాశాలు రావొచ్చు. వీటికి సంబంధించిన నైపుణ్యాలను ఎలా పెంచుకోవాలో కౌన్సెలర్ల వద్ద తెలుసుకోవచ్చు. కెరియర్‌పరంగానే కాకుండా దీనికి కావాల్సిన మానసిక సంసిద్ధతనూ అందిస్తారు. నైపుణ్యాలు, ఆసక్తి, ఆలోచనలు, భావోద్వేగాలనూ తెలుసుకొని దానికి తగినట్లు కెరియర్‌ను కూడా సూచిస్తారు.


వ్యాపారరంగంలోనూ..

చదువు, ఉద్యోగం మాత్రమే కాదు, వీరు వ్యాపారరంగంలోనూ సలహాలు, సూచనలు అందిస్తారు. నైపుణ్యం, ఆసక్తి ఉండి కూడా ధైర్యంలేక వెనకడుగు వేస్తున్నప్పుడు వీరిని సంప్రదిస్తే సరైన మార్గాన్ని చూపిస్తారు. ఆసక్తి మేరకు మెరుగుపరుచుకోవాల్సిన అంశాలను చెప్పి, అడుగుపెట్టే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలూ చెబుతారు. విద్యార్థిగా ఉన్నప్పుడు ఉన్న అభిరుచిని కూడా కెరియర్‌గా మార్చుకోవడానికి చేయూతనిస్తారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఉన్న వేదికలు, పలురకాల యాప్‌ల గురించి అవగాహన కలిగిస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్