ఈ విషయంలో వాళ్లే స్ఫూర్తి!

ఈ తరం అమ్మలకు బాధ్యతలెక్కువ. ఓవైపు పిల్లలకు మార్గదర్శిగా స్ఫూర్తినిస్తూనే కెరియర్‌లో రాణించాలి. ఇక నాయకత్వ బాధ్యతల్నీ అందుకోవాలంటే అందుకు తగ్గ ఆత్మవిశ్వాసం, ధైర్యం తప్పనిసరి.

Published : 13 Oct 2022 00:23 IST

అనుభవ పాఠాలు

ఈ తరం అమ్మలకు బాధ్యతలెక్కువ. ఓవైపు పిల్లలకు మార్గదర్శిగా స్ఫూర్తినిస్తూనే కెరియర్‌లో రాణించాలి. ఇక నాయకత్వ బాధ్యతల్నీ అందుకోవాలంటే అందుకు తగ్గ ఆత్మవిశ్వాసం, ధైర్యం తప్పనిసరి. నాపరంగా ఈ విషయంలో అదృష్టవంతురాలిననే చెప్పాలి. మా అమ్మ వర్కింగ్‌ విమెన్‌. ఆ కాలంలోనే ఆడవాళ్ల ప్రాతినిధ్యం తక్కువున్న రంగంలో ధైర్యంగా నిలదొక్కుకోగలిగింది. మా బామ్మ ఇంగ్లిష్‌ అనర్గళంగా మాట్లాడగలదు. క్రీడలంటే అమితాసక్తి. పిన్ని, అత్తలు.. బ్యాంకింగ్‌, బోధన, బయోటెక్నాలజీ ఇలా నచ్చిన రంగాల్లో రాణిస్తున్నారు. దీంతో ఇదే ఎంచుకోవాలనే ఒత్తిడి, లింగవివక్ష వంటివి ఎరుగను. వీళ్లందరి ప్రభావంతో నాకు నచ్చిన మార్గాన్ని ఎంచుకుంటూ వచ్చా. స్వతంత్రంగా ఉండటం, నలుగురినీ నడిపించడం అలవరచుకున్నా. ఇంట్లో చదువుకున్న మహిళ ఉంటే అభివృద్ధి సాధ్యమనడానికి ఉదాహరణే ఇది. అలాగని కుటుంబాన్ని ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు. పనికీ, ఇంటికీ పరిమితులు విధించుకున్నారు. ఈ విషయంలో అమ్మ నాకు స్ఫూర్తి. బయటి గాంభీర్యం, పని తాలూకూ ఒత్తిడిని ఇంటిదాకా రానిచ్చేది కాదు. ప్రేమ, నాకివ్వాల్సిన సమయం విషయంలో రాజీపడలేదు. ఎలాంటి లోటుపాట్లకూ తావివ్వకుండా మల్టీటాస్కింగ్‌ చేసేది. ఇప్పుడు బైజూస్‌లోనూ, అమ్మగా నా బాధ్యతల్ని సమర్థంగా నిర్వహించగలుగుతున్నానంటే ఆవిడే కారణం. మహిళలందరూ ఈ సూత్రాన్ని అర్థం చేసుకుంటే మన విజయానికి ఏదీ అడ్డంకి అవదు.

- దివ్య గోకుల్‌నాథ్‌, కో ఫౌండర్‌, బైజూస్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్