బాధ్యతలు నేర్పితేనే బరువు తగ్గేది....

మహిళలే ఎక్కువగా మల్టీటాస్కింగ్‌ చేస్తుంటారు. ఇటు ఇంట్లో, అటు ఆఫీసులో... అన్ని పనులూ తలకెత్తుకుని చేసే క్రమంలో ఎదురయ్యే ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండి.

Published : 13 Nov 2022 00:09 IST

మహిళలే ఎక్కువగా మల్టీటాస్కింగ్‌ చేస్తుంటారు. ఇటు ఇంట్లో, అటు ఆఫీసులో... అన్ని పనులూ తలకెత్తుకుని చేసే క్రమంలో ఎదురయ్యే ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండి.

ప్రణాళికతో...

రోజూ ఇంట్లో, ఆఫీసులో ఏ పనులు చేయాలో ముందే తెలిసి ఉంటుంది. వాటిని ఎలా పడితే అలా కాకుండా ప్రణాళికాబద్ధంగా ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయండి. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. ఒత్తిడి లేకుండా పనీ పూర్తవుతుంది.

అన్నీ మీరే వద్దు...

ఇల్లాలిగా అన్ని పనులూ సక్రమంగా జరగాలని కోరుకోవడం సహజమే. కానీ, అన్నీ మీరే చేయాలనుకోవద్దు. ఇతర కుటుంబ సభ్యులకూ కొన్ని బాధ్యతలు అప్పగించండి. ముఖ్యంగా వారి వ్యక్తిగత పనులను వారే చేసుకునేలా చూసుకోండి. అప్పుడే వారికీ అలవాటవుతాయి. మీ పనీ సులువవుతుంది.

విరామం తీసుకోండి...

పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా, అసహనం, కోపం, చిరాకు వంటివి వేధిస్తున్నా కొంత విరామం తీసుకోండి. సేద తీరండి. ఉల్లాసం కలిగించే ప్రదేశాలకు వెళ్లండి. స్నేహితుల అనుభవాలు తెలుసుకోండి. సామాజిక మాధ్యమాల్లో ఉండే నెట్‌వర్క్‌ల్లో చేరి... తోటి వారితో అభిప్రాయాలు పంచుకోండి. ఇవన్నీ మీకు కొంత భారాన్ని తగ్గిస్తాయి. తిరిగి కొత్త ఆలోచనలతో మరింత పక్కా ప్రణాళికలతో పనులు చేపట్టండి. అప్పుడే ఒత్తిడి తగ్గుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్