ఉద్యోగం భద్రమవ్వాలంటే..

ఆర్థికమాంద్యం భయంతో సంస్థలన్నీ ‘సేఫ్‌’ బాట పట్టాయి. కొన్ని సంస్థలు తొలగింపులు చేపడుతున్నాయి. ఆ జాబితాలో మీరుండొద్దంటే..

Published : 20 Nov 2022 00:57 IST

ఆర్థికమాంద్యం భయంతో సంస్థలన్నీ ‘సేఫ్‌’ బాట పట్టాయి. కొన్ని సంస్థలు తొలగింపులు చేపడుతున్నాయి. ఆ జాబితాలో మీరుండొద్దంటే..

* తక్కువతో ఎక్కువ లాభం.. సంస్థ అనుసరించే ప్రధాన సూత్రమిది! ఇచ్చిన పని చేసుకొని పోతా.. అన్న తీరు ఎప్పుడూ పనికిరాదు. ఎలాంటి స్థితిలోనైనా బాధ్యత తీసుకునే తత్వం ఉంటేనే స్థానాన్ని పదిలపరచుకోగలరు. ఆ తత్వం ఉందేమో చెక్‌ చేసుకోండి.

* ఫలానా వ్యక్తి పనిచేస్తే పక్కాగా ఉంటుంది.. కొందరి విషయంలో ఈ ప్రస్తావన చాలా సార్లు వింటుంటాం. నిజానికి వంట పూర్తవగానే స్టవ్‌ తుడి చేయడం, గట్టు ఖాళీ చేయడం.. ఇలా ఇంట్లో ఈ పద్ధతిని చక్కగా అనుసరిస్తాం. మరి ఆఫీసులోనూ ఈ విధానాన్ని పాటిస్తున్నారా? మీ పనిని ఇంకొకరు సరిచేయాల్సి వస్తోందంటే ఇద్దరి సమయం వృథా అవుతోందని! సంస్థ ఆచితూచి ఖర్చు చేస్తుందీ సమయంలో.. అలాంటప్పుడు వనరులు వృథా అనుకుంటుంది కదా.. మీ తీరును సరిచూసుకోండి!

* ఏడాదంతా ఆఫీసుకే పరిమితమవ్వాలని ఏ సంస్థా కోరుకోదు. వ్యక్తిగత అవసరాలు, ఆరోగ్య సమస్యలతో  సెలవులు తప్పదు. ఎన్ని బాధ్యతలున్నా.. మరీ ఎక్కువగా పెడుతున్నారేమో గమనించుకోండి. కొన్ని సార్లు సెలవు రోజుల్లోనూ పని చేయాల్సి ఉంటుంది. తరచూ దాన్ని వదులుకోవడం ఇబ్బందే! కానీ ఎప్పుడో ఒకసారి రావడానికీ ఇష్టపడకపోతే.. సంస్థ అవసరాల కంటే స్వవిషయాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారన్న మెసేజ్‌ వెళ్లొచ్చు. అందుకే అత్యవసరాలకు ముందుండేలా సిద్ధమవ్వండి.

* సమయం బాలేనప్పుడు అరటిపండు తిన్నా పళ్లూడాయని సామెత! అంతా బాగున్నప్పుడు కాస్త సేదతీరినా చూసీ చూడనట్లే ఉంటారు. పరిస్థితి మారినప్పుడే సమస్య. టీ, భోజన విరామాలను నిర్దేశిత సమయాన్ని మించనీయకండి. కావాలంటే మధ్య మధ్యలో అలా వెళ్లి రావొచ్చు. కానీ అప్పుడూ ఎక్కువ సేపు వద్దు. అవసరమైతే అదనపు సమయమూ చేయాల్సి రావొచ్చు. మిగతావారు ఉన్నారులే అని తప్పించుకుంటున్నారో.. మీకే సమస్య అవొచ్చు.

* ఇలాంటి సమయాల్లో చిన్న పొరపాటుకీ భారీ మూల్యం చెల్లించాల్సి రావొచ్చు. కాబట్టి, ఆదమరపొద్దు. ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకున్నాకే సబ్‌మిట్‌ చేయడం అలవాటు చేసుకుంటే ఆ పరిస్థితి దరిచేరదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్