మనకు మనమే పోటీ!

మహిళలు గాజు తెరలను బద్ధలు కొట్టుకుని పైపైకి దూసుకుపోవాలంటే ప్రయాణంలో అలసి పోకూడదు. అందుకే ముందు మనతో మనం పోటీ పడాలి అంటారు కెరియర్‌ నిపుణులు. అందుకోసమే ఈ సూచనలు.

Updated : 28 Nov 2022 13:21 IST

మహిళలు గాజు తెరలను బద్దలుకొట్టుకుని పైపైకి దూసుకుపోవాలంటే ప్రయాణంలో అలసి పోకూడదు. అందుకే ముందు మనతో మనం పోటీ పడాలి అంటారు కెరియర్‌ నిపుణులు. అందుకోసమే ఈ సూచనలు.

* జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే... కాలంతో పాటు మనమూ మారాలి...మార్పుని అంగీకరించాలి. నిర్వహణా సామర్థాలు పెంచుకోవాలి. నిజానికి మహిళలకు ఈ విషయం తెలిసినా.. సరైన ప్రణాళిక లేక సమన్వయ లోపం వారిని ఇబ్బంది పెడుతుంది. పెద్ద పెద్ద లక్ష్యాలను చేరుకునేందుకే ప్రణాళికలు అనే అపోహ వీడి..ప్రాధాన్యతా క్రమంలో వాటిని తయారు చేసుకోండి. మూస ధోరణులకు చెల్లు చీటీ చెప్పి...ఆలోచనలో, ఆహార్యంలో, పనితీరులో...మార్పు చేసుకోగలిగితే.. మీకు మీరే సాటి.

* కెరియర్‌లో ఓటమి ఎదురైతే ఇక ఏమీ చేయలేం అనుకోవద్దు. అలాగని ప్రతిసారీ జరిగిన తప్పుని పొరబాట్లని కప్పి పుచ్చుకోవద్దు. ప్రతి పనికీ ప్లాన్‌ బి ఉంచుకోగలిగితే... వైఫల్యాలు తగ్గుతాయి.

* ఇతరులతో పోటీ పడటం వల్ల కొన్నిసార్లు అనారోగ్యకరమైన పోటీ, ప్రతికూల ఆలోచనలు, మానసిక ఆందోళన తలెత్తుతాయి. వీటిని అధిగమించాలంటే ఏ ఉద్యోగంలో అయినా తోటివారి నుంచి పోటీ తప్పదనే విషయాన్ని అంగీకరించాలి. అలాగని దాన్ని అసూయగానో, విద్వేషంగానో మార్చుకోవద్దు. ఎదుటివారి బలాల్ని అంగీకరించగలగాలి. అవి మనలో ఎందుకు లోపించాయో సమీక్ష చేసుకోవాలి. అప్పుడే ముందుకు సాగిపోగలరు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్