నిఘంటువులో.. మన గురించే వెదికారు!

మరోవారం పదిరోజుల్లో ఈ ఏడాదికి వీడ్కోలు చెప్పేస్తాం! మరి ఈ సంవత్సరంలో జరిగిన కీలకమైన సంఘటనల్ని ఒక్క పదంలో చెప్పమంటే ఏం చెప్తారు? అలా చెప్పడం కష్టమే అంటారా.

Updated : 21 Dec 2022 04:51 IST

మరోవారం పదిరోజుల్లో ఈ ఏడాదికి వీడ్కోలు చెప్పేస్తాం! మరి ఈ సంవత్సరంలో జరిగిన కీలకమైన సంఘటనల్ని ఒక్క పదంలో చెప్పమంటే ఏం చెప్తారు? అలా చెప్పడం కష్టమే అంటారా. డిక్షనరీ.కామ్‌ మాత్రం ‘ఉమెన్‌’ అనే పదాన్ని 2022 వర్డ్‌ ఆఫ్‌ది ఇయర్‌గా ప్రకటించింది. 2022లో ఎన్నో కీలకమైన సంఘటనలు జరిగినా... వాటిని కాకుండా ఉమెన్‌ అనే పదాన్ని నెటిజన్లు 1400 శాతం అధికంగా అన్వేషించారట. అలాగని ఇదేదో ట్రెండు అనుకొంటే పొరపాటు అంటోంది డిక్షనరీ.కామ్‌ నివేదిక. ‘ప్రపంచవ్యాప్తంగా స్త్రీల అస్తిత్వానికి ప్రాముఖ్యం పెరుగుతోంది. వాళ్లు సాధించిన విజయాలు కూడా మహిళల గురించి ఆలోచింప చేస్తున్నాయి. ఈ ఏడాది అమెరికాకు చెందిన నల్ల జాతీయురాలు కెతంజీ బ్రౌన్‌ సుప్రీంకోర్టుకి న్యాయమూర్తి కావడం, ఇంకా స్త్రీలు సాధించిన అనేకానేక విజయాలు, ఎలిజబెత్‌రాణి మరణం ఉమెన్‌ అనే పదాన్ని ఇంతగా వెతకడానికి కారణమయ్యాయ’ని ఈ నివేదిక చెబుతోంది. నెలకి 7కోట్లమంది ఈ డిక్షనరీని వాడుతుంటారు. వీళ్లలో ఎక్కువ మంది ఉమెన్‌ అనే పదాన్ని మాత్రమే కాక, దాని నిర్వచనం కోసమూ వెతకడం విశేషం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్