విరామం తర్వాత ఉద్యోగమా?

పెళ్లి, పిల్లలు, ఇంట్లో పెద్దల బాధ్యతలు ...కారణాలేవైనా ఉద్యోగానికి తాత్కాలిక విరామం తర్వాత కొత్తగా కొలువులో చేరాలనుకుంటున్నారా? ఇలాంటప్పుడు ఏ మాత్రం తడబడొద్దంటున్నారు కెరియర్‌ నిపుణులు. ఉద్యోగాన్ని సంపాదించడంలో ఈ సూత్రాలు మీకు సాయపడతాయని సూచిస్తున్నారు.

Updated : 18 Feb 2023 04:49 IST

పెళ్లి, పిల్లలు, ఇంట్లో పెద్దల బాధ్యతలు ...కారణాలేవైనా ఉద్యోగానికి తాత్కాలిక విరామం తర్వాత కొత్తగా కొలువులో చేరాలనుకుంటున్నారా? ఇలాంటప్పుడు ఏ మాత్రం తడబడొద్దంటున్నారు కెరియర్‌ నిపుణులు. ఉద్యోగాన్ని సంపాదించడంలో ఈ సూత్రాలు మీకు సాయపడతాయని సూచిస్తున్నారు.

నిజాయతీగా చెప్పండి... కెరియర్‌లో బ్రేక్‌ తీసుకుని తిరిగి ఉద్యోగంలో చేరే మొదటి వ్యక్తో, చివరి వ్యక్తో మీరు కాదు. విరామం తీసుకోవడం తప్పూ కాదు. దానికి చిన్నబుచ్చుకోవడం, తప్పు చేసినట్లుగా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం వంటివి చేయొద్దు. ముఖాముఖిలో అందుకు కారణాలు వెల్లడించాల్సి వచ్చినప్పుడు నిజాయతీగా చెప్పండి. పిల్లలనో, పెద్దలనో చూసుకోవడానికి ఆ పని చేయాల్సి వస్తే అది ప్రశంసనీయమే కదా!

తరచి చూడండి... గతంలో ఎప్పుడో తయారు చేసిన రెజ్యూమెను ఇప్పుడు ఉద్యోగానికి వాడకండి. ఇప్పటి పరిశ్రమ అవసరాలను గుర్తించి...అందుకు తగ్గ మీ నైపుణ్యాలను ప్రస్తావిస్తూ కాస్త సృజనాత్మకంగా దాన్ని తయారు చేయండి. కెరియర్‌ విరామాన్ని స్పష్టంగా చెప్పాల్సి వచ్చినా కూడా... దాన్ని హైలైట్‌ చేయాల్సిన అవసరం రాకుండా నాన్‌క్రోనలాజికల్‌ విధానంలో దీన్ని రూపొందించండి.

ముఖాముఖికి కొత్తగా... ఇంటర్వ్యూకి వెళ్లే ముందు సాధన చేయడం మరిచిపోవద్దు. గతంలో మీరెదుర్కొన్న ముఖాముఖిలకు భిన్నంగా ఇది ఉండొచ్చు. ఇప్పటి మార్కెట్‌ అవసరాలూ, వచ్చిన మార్పులకు అనుగుణంగా మిమ్మల్ని మీరు ఎంత మార్చుకున్నారో చెప్పాల్సి రావొచ్చు. ఇందుకోసం ముందుగానే డిజిటల్‌ టెక్నాలజీ, నూతన సాఫ్ట్‌వేర్లలో సర్టిఫికేషన్‌ కోర్సులు చేయండి. ఇవన్నీ మీరు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసేలా చేస్తాయి.

నెట్‌వర్క్‌ కావాలి... ఉద్యోగ వేటలో ఉన్నప్పుడు... మార్కెట్‌ పోకడల్నీ, ఇండస్ట్రీ అవసరాల్నీ గుర్తించాలంటే ముందు మీరు సంబంధిత నెట్‌వర్క్‌లో భాగం కావాలి. ఇందుకోసం ఇప్పుడు లింక్డిన్‌ వంటి ప్రొఫెషనల్‌ మాధ్యమాలెన్నో ఉన్నాయి. ఇవన్నీ మిమ్మల్ని అప్‌టూ డేట్‌గా ఉంచుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్