పనిచేస్తే సరిపోతుందా...

రమ్య... శ్రమ, పట్టుదలతో విధులు సక్రమంగా, సకాలంలో పూర్తి చేసే ఉద్యోగిని. పై అధికారులను గౌరవిస్తుంది. ఎంత పెద్దవారు అయినా వారితో స్నేహపూరితమైన వాతావరణాన్ని ఏర్పరచుకుంటుంది. కానీ తన సహోద్యోగులతో, కిందిస్థాయి వారితో తన నడవడిక అంత మంచిగా ఉండదు. సంస్థలో గుర్తింపు లభించినా, తోటివారు ఆమెను చూస్తే మొహం చిట్లించుకుంటుంటారు.

Published : 27 Feb 2023 00:17 IST

మ్య... శ్రమ, పట్టుదలతో విధులు సక్రమంగా, సకాలంలో పూర్తి చేసే ఉద్యోగిని. పై అధికారులను గౌరవిస్తుంది. ఎంత పెద్దవారు అయినా వారితో స్నేహపూరితమైన వాతావరణాన్ని ఏర్పరచుకుంటుంది. కానీ తన సహోద్యోగులతో, కిందిస్థాయి వారితో తన నడవడిక అంత మంచిగా ఉండదు. సంస్థలో గుర్తింపు లభించినా, తోటివారు ఆమెను చూస్తే మొహం చిట్లించుకుంటుంటారు. దీంతో బృందస్ఫూర్తి లోపించి కొన్నిసార్లు పనులు పూర్తిచేయడంలో వెనుకబడుతోంది.
ఒక వ్యక్తి వ్యక్తిత్వం తెలియాలంటే వారికన్నా పెద్ద వాళ్లని ఎలా గౌరవిస్తున్నారు, చిన్నవాళ్లతో ఎలా నడుచుకుంటున్నారు అనే దాన్నిబట్టి ఇట్టే చెప్పేయొచ్చు. ఉద్యోగం చేసే చోటైతే ఇలాంటి చిన్న చిన్న విషయాలే సహోద్యోగులతో, పై అధికారులతో సత్ససంబంధాలు నెరపడానికి ఉపయోగపడతాయి.

పనులు పూర్తవ్వాలంటే...  మనలో చాలా మంది పై అధికారులకు గౌరవం ఇస్తాం. కానీ మనకన్నా కింది స్థాయిలో ఉన్న వారిని తక్కువగా చూస్తాం. అలా కాకుండా అందరిని ఒకేలా చూడాలి.

పనిచేస్తున్న సంస్థలో ఒక స్థాయికి రాగానే నా అంతటి వారు లేరన్నట్టు వ్యవహరిస్తుంటారు. అక్కడినుంచే పతనం మొదలవుతుంది. వ్యక్తిగత స్కోర్‌కు ఇది ఉపయోగపడినా... బృందంగా పనిచేసేటప్పుడు ఇతరులకంటే వెనుకబడిపోతారు. మిగిలిన బృందాలతో పోటీ పడలేరు. అలా కాకుండా పెద్దవారితో సన్నిహితంగా ఉంటూ, చిన్నవారిని ప్రోత్సహిస్తూ విధులు నిర్వర్తిస్తే అనుకున్న లక్ష్యాలను త్వరగా చేరుకోగలం.

ఎప్పుడూ ఒకే పని చేసే వాళ్లకి చేస్తున్న పనిలో కొత్త కోణాలు... ఉన్నా కనిపించవు. అదే కొత్తవారి అభిప్రాయాలు సేకరించడం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు వాళ్ల ఆలోచనలకు విలువ ఇస్తున్నామన్న భావన కలిగి మరింత ఉత్సాహంగా పనిచేస్తారు.  

గిల్లి కజ్జాలు రాకుండా చూసుకోవాలి. ఒకవేళ ఉన్నా వాటి వల్ల విధులకు అంతరాయం కలగకుండా జాగ్రత్తపడాలి. అప్పుడే అనుకున్నది సాధించగలం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్