కార్పొరేట్‌ నైపుణ్యాలు పెంచుకోవాలి...

విద్యార్థి దశ నుంచి ఒక్కసారే కార్పొరేట్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టడమంటే కొంత ఒడుదొడుకులెదురవుతాయి. కార్పొరేట్‌ సంస్థలో బాధ్యతలు చేపట్టాలంటే కొన్నిరకాల నైపుణ్యాలు తెలిసుండాలి.

Published : 12 Mar 2023 00:11 IST

విద్యార్థి దశ నుంచి ఒక్కసారే కార్పొరేట్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టడమంటే కొంత ఒడుదొడుకులెదురవుతాయి. కార్పొరేట్‌ సంస్థలో బాధ్యతలు చేపట్టాలంటే కొన్నిరకాల నైపుణ్యాలు తెలిసుండాలి. వీటినే  కార్పొరేట్‌ సర్వైవల్‌ స్కిల్స్‌ అంటున్నారు నిపుణులు.

కెరియర్‌లోకి అడుగుపెట్టేటప్పుడు తెలియనివారు, గతంలో పరిచయం లేరంటూ ఎదుటపడిన వ్యక్తిలను దాటి ముందుకెళ్లకూడదు. గతంలో ముఖపరిచయం లేని వ్యక్తులతో కూడా మాట కలపడం నేర్చుకోవాలి. ఓ పలకరింపు అవతలివారి గురించి తెలుసుకోవడానికి మార్గం అవుతుంది. తెలియనివారితోనూ సునాయసంగా మాటకలపడం కొత్త సామర్థ్యమే. ప్రాజెక్ట్‌కు సంబంధించి తెలియని వ్యక్తులతో ఏర్పాటు చేసే సమావేశాల్లో ఈ నైపుణ్యం ఉపయోగపడుతుంది. కార్పొరేట్‌ కార్యాలయంలో విధులు నిర్వహించాలంటే చేపట్టాల్సిన బాధ్యతలపై అవగాహన ఉంటే సరిపోదు. సహోద్యోగులతో మెలగడం, ఉన్నతాధికారితో మాట్లాడే విధానంలో మెలకువలు తెలిసుండాలి.

అనుసంధానం.. ఆఫీస్‌లో సహబృందంతో పరస్పర అనుబంధం.. ప్రాజెక్ట్‌ వివరించడం లాంటివి తేలిక చేస్తుంది. ఒకరినొకరికి పరిచయం చేయడానికి ముందుగా బృందంలో ప్రతి ఒక్కరూ తెలుసుండాలి. ఇలా జరగాలంటే వారితో విడివిడిగా మాట్లాడటానికి ప్రయత్నించాలి. దీంతో ముందుగానే అందరి గురించి వివరాలు తెలుస్తాయి. ఆ తర్వాత బృంద నేతృత్వంలో అందరి మధ్య అనుబంధాన్ని ఏర్పరిచి విజయవంతంగా ప్రాజెక్ట్‌ పూర్తిచేయించొచ్చు.

వినాలి.. ఎదుటివారు చెప్పేది పూర్తిగా వినడానికి ప్రయత్నించాలి. అవసరమైతే చర్చించడానికి ఆసక్తి చూపించాలి. స్థాయి ఏదైనా... విజయం చిన్నదైనా.. పెద్దదైనా.. దానికి కారణమైనవారిని గుర్తించి ప్రశంసించాలి. అవతలివారు  అపజయంతో నిరుత్సాహంగా ఉన్నప్పుడు.. మరోసారి ప్రయత్నించమంటూ ప్రోత్సహించాలి. అవసరమైతే సలహా ఇవ్వాలి. అంతేకాదు, ప్రాజెక్ట్‌ సొంతదైనా.. అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోయినా, దానిపై సరైన అవగాహన లేకపోయినా సహాయం అడగడానికి వెనకాడొద్దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్