Published : 14/03/2023 00:18 IST

నచ్చిన వృత్తినే ఎంచుకుందాం!

ఎంత బాగా చదివినా సరే.. కెరియర్‌ను ఎంచుకునే విషయంలో మనలో చాలామంది తడబడుతుంటారు. అటువంటప్పుడు చేరిన ఉద్యోగం నచ్చక, మరే మార్గం కనిపించక ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి పరిస్థితిని అధిగమించడానికి కెరియర్‌ పర్సనాలిటీ టెస్టులు ఉపయోగపడతాయి. అందరికీ ఒకే రకమైన వృత్తి నైపుణ్యాలు ఉండవు. ఒక పనిని అందరూ ఒకేలా చేయలేరు. విజయవంతమైన, స్థిరమైన వృత్తి జీవితం ఉండటం ఎంతో ముఖ్యం. వృత్తి జీవితంలో విజయం పొందలేని వారు వ్యక్తిగత జీవితంలోనూ సంతృప్తిగా లేనట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి మన వ్యక్తిత్వానికి, నైపుణ్యాలకు తగ్గట్టు అవకాశాలను అందిపుచ్చుకోవటం అవసరం. ఈ పర్సనాలిటీ పరీక్షలు మనలోని ఆసక్తులు, సామర్థ్యాలు, ఇష్టాయిష్టాలను అంచనా వేసి మనం ఏ వృత్తికి సరిపోతామో అంచనా వేస్తాయి. ఇలాంటి పరీక్షలు నిర్వహించే సంస్థలను ఆన్‌లైన్లో వెతికి ఉత్తమమైన వాటిని ఎంచుకోవచ్చు. తద్వారా నచ్చిన ఉద్యోగాన్ని చేపట్టి వృత్తి జీవితంలో ఉన్నతంగా ఎదగగలుగుతాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని