40ల్లో పొదుపు చేయండిలా..
యుక్త వయసులో పెళ్లి, పిల్లలు, ఇంటి బాధ్యతల కారణంగా ఉద్యోగాన్ని పక్కన పెట్టేస్తాం. ఇక పొదుపు ఎక్కడ వీలవుతుంది. కానీ మనకంటూ ప్రత్యేకంగా పొదుపు చాలా ముఖ్యం.
యుక్త వయసులో పెళ్లి, పిల్లలు, ఇంటి బాధ్యతల కారణంగా ఉద్యోగాన్ని పక్కన పెట్టేస్తాం. ఇక పొదుపు ఎక్కడ వీలవుతుంది. కానీ మనకంటూ ప్రత్యేకంగా పొదుపు చాలా ముఖ్యం. 40ల్లోకి వచ్చాక పొదుపు చేయాలనుకున్నా మంచి ఆలోచనే. దానికి కొన్ని పద్ధతులు పాటించమంటున్నారు నిపుణులు.
* ఇప్పుడు పెట్టుబడి పెట్టేందుకు చాలానే అవకాశాలున్నాయి. మార్కెట్ గురించి తెలియజేసే వీడియోలు చూడండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. వాటి గురించి పూర్తి అవగాహన వచ్చాక కొద్ది మొత్తంలో మార్కెట్లో పెట్టుబడిగా పెట్టండి.
* అత్యవసరానికి కొంత డబ్బును తీసి ప్రతి నెలా పక్కన పెట్టుకోండి. ఇది తప్పనిసరిగా చేయాల్సిన పొదుపు. ఎందుకంటే అత్యవసరంగా ఏమైనా అవసరమైతే అప్పటి కప్పుడు అప్పు చేయాల్సి వస్తుంది. అలా కాకుండా అందుబాటులో నగదు ఉంటే ఇబ్బంది ఉండదు.
* ఇంతకు ముందు తీసుకున్న రుణాలు, క్రెడిట్‌కార్డు, లోన్‌లు తీర్చేయాలి. లేకపోతే మీరు పొదుపు మీద దృష్టి పెట్టలేరు. ఈ వయసులో పొదుపు చేయాలే కానీ అప్పులు కాదని గుర్తుంచుకోండి.
* జీవిత బీమా తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబీకులకు ఆసరాగా ఉంటుంది. అనవసరపు ఖర్చులను దాటవేయండి. అత్యవసరం అనుకున్న వాటికి మాత్రమే ఖర్చు చేయండి. వీకెండ్ ఏమైనా ప్లానింగ్ చేయాల్సి వస్తే నెల ప్రారంభంలోనే దీని గురించి ప్రణాళిక వేసుకుంటే సరి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.