Published : 25/05/2023 00:10 IST

కొంచెం ఆగండి!

అందరిలోనూ కోపం, బాధా, దుఃఖం, అసూయా.. ఉద్వేగాలు ఉంటాయి. ఇవి మహిళల్లో కాస్త ఎక్కువ. ఇలాంటప్పుడు... మాట్లాడే మాటలు... కాస్త పదునుగా ఉంటాయి. దాంతో గొడవ పెద్దదై విభేదాలు తారస్థాయికి చేరే ప్రమాదమూ ఉంది. ఇలా కాకూడదంటే...

* ఎదుటివారిపై కోపమొచ్చింది. వాళ్లపై తీవ్రంగా ఓ మాట విసిరేస్తే అది కాస్తా పెద్దది అవుతుంది. ఈ పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే.. ఆ సమయంలో కనీసం ఓ పది నిమిషాలు స్పందించకుండా ఉండి పొమ్మంటున్నారు నిపుణులు. ఇది కాస్త కష్టమే కానీ,  ‘ఇందులో నుంచి బయటపడాలి!’ అని కాస్త పట్టుదలగా అనుకుంటే మనసు మాట వింటుంది. మొదట అక్కడి నుంచి కాసేపు పక్కకి వెళ్లండి. తర్వాత మరో అంశంపైకి దృష్టి మరల్చండి. ఇలా విషయ తీవ్రతని బట్టి గంటా, ఓ పూటా, వీలైతే ఓ రోజంతా కూడా స్పందించకుండా ఉండండి. అప్పటికి కొంచెం సరిగా ఆలోచించగలుగుతారు.

* మాట తీరే... చాలా సమస్యలకు కారణం. అందరినీ మెప్పించడం ఎవరివల్లా కాదు. అలాగని ఇతరులను నొప్పించడమే పనిగానూ పెట్టుకోవద్దు. ఏ విషయాన్నైనా చెప్పే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఏదైనా కీలక విషయంపై మాట్లాడాల్సి వస్తే... ముందు కాగితంపై రాసుకోండి.

* పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. అలాగని మాట్లాడిన ప్రతిసారీ ఎదుటివారి తప్పొప్పుల ప్రసక్తి వద్దు. మీరు ఎదుర్కొన్న సంఘటన మీ మనసుపై ఎలాంటి ప్రభావం చూపిందో అది మాత్రమే వ్యక్తంచేయండి. దాన్నే సూటిగా చెప్పండి. అది ఇతరులకీ అర్థమవుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని