అన్నీ నా గురించే అనుకోవద్దు...
కాలం ఎంతగా మారినా భర్త, ఇల్లు, పిల్లలే ప్రపంచంగా బతికే మహిళలు చాలామందే. అయితే, బయట ప్రపంచంతో పెద్దగా సంబంధాలు లేకపోవడం, ఇంటికే పరిమితం కావడం వల్ల కొందరు ఆత్మన్యూనతకు గురవుతుంటారు. అభద్రతతో బాధపడుతుంటారు.
కాలం ఎంతగా మారినా భర్త, ఇల్లు, పిల్లలే ప్రపంచంగా బతికే మహిళలు చాలామందే. అయితే, బయట ప్రపంచంతో పెద్దగా సంబంధాలు లేకపోవడం, ఇంటికే పరిమితం కావడం వల్ల కొందరు ఆత్మన్యూనతకు గురవుతుంటారు. అభద్రతతో బాధపడుతుంటారు. అలాంటివారు దాన్నుంచి బయటపడాలంటే ఈ భ్రమల్ని వదిలేయమంటారు నిపుణులు.
* చుట్టూ ఉన్న వాళ్లందరికీ అన్నీ తెలుసనీ, మనమే వెనకపడిపోయామనీ అనుకోనక్కర్లేదు. సృష్టిలో ఎవరూ పరిపూర్ణులు కాదు. ఎదుటివారి బలాల గురించి కాదు.. మీకున్న సానుకూలతల్ని గుర్తించండి. అయినా, భయం పోవడం లేదా? మీరనుకున్నట్లే బలవంతులైన అవతలివారి సాయంతో మారడానికి ప్రయత్నించండి. అనవసరంగా భయపడటం వల్ల మీరు మరింత బలహీనమైపోతారని మరిచిపోవద్దు.
* ఎవరితీరైనా బాధించిందా?దాన్ని వారితో పంచుకోండి.అప్పుడే మీరు ఊహించుకుంటున్నారా? నిజంగానే అలా జరుగుతోందా అన్నది వారు గమనించగలుగుతారు. కాదంటే మీకు చెబుతారు.
* తప్పులు సరిచేసుకోవడానికి, ఎప్పటికప్పుడు అప్‌డేట్ కావడానికీ ముందుండండి. ఆత్మస్థైర్యమే అన్నింటా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఏ పనిలోనైనా మీకంటూ ప్రత్యేకశైలిని అలవరుచుకోండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.