మీకు మీరే సరి చూసుకోండి!

ఇద్దరూ సంపాదిస్తేనే కానీ, ఇల్లు గడవడం లేదు. ఇలాంటప్పుడు వృత్తి జీవితాన్ని ఒత్తిడి లేకుండా చూసుకోవాలంటే ఈ సూత్రాలు పాటించక తప్పదంటారు కెరియర్‌ నిపుణులు.

Published : 17 Aug 2023 00:23 IST

ఇద్దరూ సంపాదిస్తేనే కానీ, ఇల్లు గడవడం లేదు. ఇలాంటప్పుడు వృత్తి జీవితాన్ని ఒత్తిడి లేకుండా చూసుకోవాలంటే ఈ సూత్రాలు పాటించక తప్పదంటారు కెరియర్‌ నిపుణులు.

  • ఉద్యోగంలో కుదురుకునే వరకూ ఓ రకమైన ఒత్తిడి ఉంటే, ఆ తర్వాత జీవితం మరో రకంగా ఉంటుంది. మీరు చేస్తున్న పనిలో సంతృప్తి పొందాలంటే ముందు మీలో ఏం మార్పులు చేసుకోవాలో గమనించుకోండి. ప్రొఫెషనల్‌ స్కిల్స్‌ మాత్రమే ఉంటే సరిపోదు. టీమ్‌తో కలిసిపోయి పనిచేయగలిగే తత్వమూ కావాలి. నేర్చుకో వాలనుకున్నప్పుడు ఇతరులను అడిగి తెలుసుకోవడానికి వెనకాడొద్దు. ఎదుటివారితో మీ అభిప్రాయాలు పంచుకోవడంలో మొహమాటమూ పనికిరాదు. అప్పుడే మీ కెరియర్‌పై మీకో స్పష్టత వస్తుంది.
  • కొలువులో స్థిరపడ్డాం కదా! ఇంకేం లక్ష్యాలుంటాయి అనుకోవడం పొరబాటు. ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలను పెట్టుకోవాలి. వాటిని చేరుకోగానే మరో గమ్యానికి దారి వేసుకోవాలి. ఇలా చేస్తేనే కెరియర్‌లో ముందుకు వెళ్లగలరు. ఒత్తిడి లేకుండా వృత్తి జీవితాన్ని కొనసాగించగలరు.
  • అసలు మీ బలాలేంటో? బలహీనతలేంటో ఎప్పుడైనా సమీక్షించుకున్నారా? లేదంటే వెంటనే ఆ పనిచేయండి. మనకి మనమే అర్థం కానప్పుడు అతిగా ఊహించుకోవడం, అసలు మనమేం చేయలేమని బాధపడటం రెండూ జరుగుతూ ఉంటాయి. ఈ రెండు కెరియర్‌లో వెనక్కి లాగేవే. వాస్తవికంగా సమీక్షించుకుని లోపాలను పరిహరించుకోగలిగితే మిమ్మల్ని మీరు కొత్తగా చూసుకోవచ్చు. బాధ్యతల్ని స్వీకరించే క్రమంలోనే స్థాయిని అంచనా వేసుకోవడం, సమయాన్ని నిర్దేశించుకోవడం, వాస్తవిక అంచనాలు మీలో క్రమశిక్షణను అలవరుస్తాయి.
  • పనిలో పొరబాట్లు జరుగుతుంటాయి. ఇలాంటప్పుడు తడబడకుండా సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే మీ సమర్థత బయటపడేది. అలా జరిగిన వాటిని ఇతరుల మీదకు నెట్టేయొద్దు. బాధ్యత తీసుకోవాల్సి వచ్చినప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నించొద్దు. ఈ సూత్రాలే మిమ్మల్ని మంచి ఉద్యోగిగానే కాదు, నాయకురాలిగానూ మారుస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్