మళ్లీ ఉద్యోగంలో చేరాలనుకుంటున్నారా?

పెళ్లి, పిల్లలు ఇలా కారణాలేమైతేనేం..కెరియర్‌కు విరామం ఇచ్చే మహిళలే ఎక్కువ. సమస్యల్లా తిరిగి మొదలుపెట్టాలనుకున్నప్పుడే. నాన్‌ టెక్నికల్‌ ఉద్యోగమైతే పర్వాలేదు.

Updated : 23 Nov 2023 01:40 IST

పెళ్లి, పిల్లలు ఇలా కారణాలేమైతేనేం..కెరియర్‌కు విరామం ఇచ్చే మహిళలే ఎక్కువ. సమస్యల్లా తిరిగి మొదలుపెట్టాలనుకున్నప్పుడే. నాన్‌ టెక్నికల్‌ ఉద్యోగమైతే పర్వాలేదు. కానీ టెక్నికల్‌ ఉద్యోగాల విషయంలో అలా కాదు. కచ్చితంగా మన నైపుణ్యాలను అప్‌డేట్‌ చేసుకోవాల్సిందే..అందుకు నిపుణులిచ్చే సలహాలివే..

వినియోగించుకోండి..

నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొంటేనే ఈ టెక్‌ ప్రపంచంలో నిలదొక్కుకోగలం. విరామం తర్వాత ఈటన్‌ రీలాంచ్‌, థాట్స్‌ వర్క్స్‌ వాపసీ, క్యాప్‌జెమిని రీలాంచ్‌, జాబ్స్‌ ఫర్‌ హర్‌ వంటి కార్యక్రమాల ద్వారా అనేక సంస్థలు టెక్నాలజీకి సంబంధించిన శిక్షణ, ఇంటర్న్‌షిప్‌ లాంటివి అందిస్తున్నాయి. వాటిలో చేరితే సరి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)కు ఇటీవల ప్రాధాన్యం పెరుగుతోంది. కాబట్టి ఇందులో నైపుణ్యం పెంచుకోవటమూ అవసరమే. అందుకు మెటా, గూగుల్‌, హబ్‌స్పాట్‌, కోర్స్‌ఎరా, మాస్టర్‌ క్లాస్‌ వంటి వాటిలో చేరి సర్టిఫికెట్‌ కోర్సు లాంటివి చేయటం ఉత్తమం. ఇలా చేస్తే తేలిగ్గా ఉద్యోగం సంపాదించుకోగలం.

నెట్‌వర్క్‌ ఉంటేనే..

నెట్‌వర్క్‌ పరిధిని పెంచుకోవటమూ ముఖ్యమే. మనం చేయాలనుకున్న జాబ్‌ రోల్‌, కంపెనీ గురించి తెలుసుకోవాలంటే అందులో పనిచేస్తున్న వాళ్లతో పరిచయం పెంచుకోవటం అవసరం. అందుకు మహిళల కోసం ప్రత్యేకించి ఉమెన్‌ హు కోడ్‌, లేడీస్‌ హు టెక్‌, గర్ల్స్‌ ఇన్‌ టెక్‌, విమెన్‌ ఇన్‌ ఏఐ లాంటి ఆన్‌లైన్‌ కమ్యూనిటీస్‌ ఉన్నాయి. వీటిలో చేరితే మన నైపుణ్యాలకు మరింత పదునుపెట్టుకోవచ్చు. వీటన్నింటితో పాటు సాఫ్ట్‌ స్కిల్స్‌ అయిన కమ్యూనికేషన్‌, ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌, సమస్యల పరిష్కారం వంటి నైపుణ్యాలు మెరుగుపరచుకోవటం మర్చిపోవద్దు. వీటన్నింటిపై దృష్టి సారిస్తే కెరీర్‌ను మళ్లీ గాడిలో పెట్టుకోవటం తేలికే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్