‘ ఆర్థికారోగ్యం’ బాగేనా?

కష్టపడి పనిచేయడం.. మన ఆడవాళ్లకి ప్రత్యేకంగా నేర్పక్కర్లేదు. ఇల్లు, ఆఫీసు పనేదైనా నిబద్ధతతో చకచకా చేసుకుంటూ వెళతాం.

Published : 26 Nov 2023 02:14 IST

కష్టపడి పనిచేయడం.. మన ఆడవాళ్లకి ప్రత్యేకంగా నేర్పక్కర్లేదు. ఇల్లు, ఆఫీసు పనేదైనా నిబద్ధతతో చకచకా చేసుకుంటూ వెళతాం. ఎంత సంపాదించినా.. ఏ స్థాయిలో నిలిచినా చాలామంది ఆర్థిక నిర్వహణ దగ్గరికి వచ్చేసరికి తడబడుతుంటారు. ఇది చాలా ప్రమాదం కదా! కాబట్టి..

ప్పగించిన బాధ్యత చక్కగా నిర్వహించామా.. వేళకి పని ముగించుకొని బయటపడ్డామా అన్నట్లే ఉంటుంది మన ఆలోచన. ఇంటి వద్ద బాధ్యతలు ఎదురు చూస్తుంటాయి కదా మరి. అలాగని ఈ చట్రంలోనే ఉండిపోతే ఎలా? చుట్టుపక్కల విషయాలూ తెలుసుకోవాలి. సంస్థలు ఉద్యోగులకు కొన్నిసార్లు ప్రత్యేకంగా మహిళలకు కొన్ని సదుపాయాలు కల్పిస్తుంటాయి. వాటి గురించి తెలుసుకోండి. హెల్త్‌ ఇన్సూరెన్స్‌, రిటైర్‌మెంట్‌ ప్లాన్స్‌, ట్యూషన్‌ రీయంబర్స్‌మెంట్‌ వంటివి చాలావరకూ సంస్థలు అందిస్తుంటాయి. వాటిలో మీకు అనువైనవి ఉపయోగించుకోవడంలో తప్పూ లేదు. డబ్బు కూడా ఆదా అవుతుంది.

బయట తింటుంటే.. యువతులైతే.. ఓపిక లేదనో, వంట చేసుకోడానికి సమయం లేదనో ఒక్కోసారి బయట తింటుంటారు. ఎప్పుడో ఒకసారి పర్లేదు కానీ.. తరచూ చేస్తోంటే పర్సు ఖాళీ. పైగా అనారోగ్యాలూ చుట్టుముడతాయి. ఆరోగ్యానికి హాని కలిగించని, తేలికగా చేసుకునే వీలున్న వాటిపై దృష్టిపెట్టండి. ఎక్కువ సమయం తీసుకోవు. ఆరోగ్యమూ పాడవదు. ఇంకా ఆ మిగిలిన డబ్బులతో ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ చేసుకోవచ్చు.

అవసరమే కానీ.. వారమంతా పనిచేస్తుంటే శరీరం, మనసు అలసిపోవడం మామూలే. ఆఫీసు ముగిశాక సేదదీరుదామని సహోద్యోగులు పిలవగానే మనసు అటుకేసి వెళ్లడమూ సాధారణమే. అలాగని బడ్జెట్‌ మరవట్లేదు కదా? ఏ ఒక్కరి ఆర్థిక అవసరాలూ ఒకలా ఉండవు. ఎదుటివారు ఖర్చు పెడుతున్నారనో.. వాళ్లముందు పరువు తక్కువనో అవసరం ఉన్నవీ లేనివీ కొనేయొద్దు. అమ్మాయిలం షాపింగులో పడితే సమయమే తెలీదు. తీరా గమనించుకునే సరికే ఖాతా ఖాళీ అయిపోతుంది. వెళ్లాల్సి వస్తే ఇంత బడ్జెట్‌ అని పెట్టుకోండి. అదీ నెలకు రెండుసార్లకు మించకపోతే మంచిది. నిజంగా సేద తీరాలంటే ఏ పార్క్‌లో నడకకో, ఆటలకో ప్రాధాన్యమిస్తే సరి. ఆనందంతో పాటు ఆరోగ్యమూ సొంతమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్