ఎక్కువగా కూర్చోవద్దు...

ఈరోజుల్లో ఉద్యోగం చేసే మహిళల సంఖ్య ఎక్కువగానే ఉంది. వాళ్లలో చాలామంది క్షణం తీరికలేని పనిలో నిమగ్నమవుతున్నారు. అలా ఆఫీసులో గంటల తరబడి కూర్చోవడం వల్ల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది అంటున్నారు నిపుణులు.

Published : 04 Feb 2024 01:49 IST

ఈరోజుల్లో ఉద్యోగం చేసే మహిళల సంఖ్య ఎక్కువగానే ఉంది. వాళ్లలో చాలామంది క్షణం తీరికలేని పనిలో నిమగ్నమవుతున్నారు. అలా ఆఫీసులో గంటల తరబడి కూర్చోవడం వల్ల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది అంటున్నారు నిపుణులు.

  • ఆఫీసుకి వెళ్లిన వెంటనే కూర్చుంటారు. ఆపై పని కారణంగా లేవలేని పరిస్థితి. అలా గంటల కొద్దీ కూర్చోవడం వల్ల శరీరంలో కణాలు బలహీనపడతాయి. దీని కారణంగా రోగనిరోధక వ్యవస్థ ప్రభావితమవుతుంది. మెడ, వెన్నునొప్పి సమస్యలు మొదలవుతాయి. కాబట్టి, ఎంత బిజీగా ఉన్నా, పని మధ్యలో కొంత విరామం తీసుకోవడానికి ప్రయత్నించాలి. పని ముగిసిన తర్వాత కొద్దిపాటి వ్యాయామం చేస్తూ ఉంటే కండరాలు చురుకుగా పనిచేస్తాయి.
  • నిరంతరం ఒకే చోట కూర్చొని పనిచేయడం వల్ల కెలోరీలు ఖర్చుకావు. దాంతో ఊబకాయం, బరువు పెరగడం జరుగుతుంది. పని మధ్యలో నీళ్లు తాగుతూ, విరామం సమయంలో నడవడం చేస్తుండాలి.
  • ఇల్లు లేదా ఆఫీసులో ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల మోకాళ్లు, నడుము నొప్పి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్