డైరీలో నింపేద్దాం...

కొంతమందికి రోజూ జరిగే విశేషాలు, చేయబోయే పనులు, జరిగిన సంగతులను డైరీలో రాసే అలవాటు ఉంటుంది. సాధారణ విషయం అనుకుంటారు కానీ దీని వల్ల ప్రయోజనాలెన్నో.

Updated : 19 Feb 2024 16:26 IST

కొంతమందికి రోజూ జరిగే విశేషాలు, చేయబోయే పనులు, జరిగిన సంగతులను డైరీలో రాసే అలవాటు ఉంటుంది. సాధారణ విషయం అనుకుంటారు కానీ దీని వల్ల ప్రయోజనాలెన్నో..

  • కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడి విశేషాలు, పరిచయాల గురించి రాస్తుంటారు. ఒత్తిడిగా అనిపించినప్పుడు వాటిని ఓసారి చదివితే ఆ జ్ఞాపకాలూ, స్నేహితుల అనుభవాలూ తిరిగి కళ్ల ముందు మెదులుతాయి. మనసుకు హాయిని కలిగిస్తాయి.
  • లక్ష్యాలు అందరికీ ఉంటాయి. కొన్నింటిని రోజువారీ హడావుడిలో మరిచిపోతుంటాం. అదే రాసిపెట్టుకుంటే? పుస్తకంలోనే కాదు, మెదడు పొరల్లోనూ నిక్షిప్తమై తరచూ గుర్తుచేస్తాయి. ఇంకేం ఆ దిశగా అడుగులు వేస్తాం. పూర్తయ్యాక కొత్తవాటిని ఏర్పరచుకుంటాం.
  • డైరీ రాయడంవల్ల మనలో జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని అధ్యయనాలూ చెబుతున్నాయి. మనసంతా పెట్టి రాస్తుంటాం కదా! అలా మనసు పొరల్లో నిలిచిపోతుంది. కొన్నిసార్లు నలుగురిలో మాట్లాడ్డానికి భయపడుతుంటాం. డైరీనీ రాసే వారిలో అది తక్కువగా ఉంటుందట.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్