నచ్చితేనే చేస్తాం... నచ్చితేనే చూస్తాం..

మనం జీవితంలో నేర్చుకునే విషయాలెన్నో. కొన్ని స్వానుభవాలైతే, మరికొన్ని ఇతరుల నుంచి నేర్చుకునేవి. అయితే వాటికీ ఓ లెక్కుంది! ఏంటంటారా... మనకు నచ్చిన వ్యక్తుల నుంచి ఏదైనా విషయాన్ని త్వరగా గ్రహిస్తామట.

Published : 23 Feb 2024 01:26 IST

మనం జీవితంలో నేర్చుకునే విషయాలెన్నో. కొన్ని స్వానుభవాలైతే, మరికొన్ని ఇతరుల నుంచి నేర్చుకునేవి. అయితే వాటికీ ఓ లెక్కుంది! ఏంటంటారా... మనకు నచ్చిన వ్యక్తుల నుంచి ఏదైనా విషయాన్ని త్వరగా గ్రహిస్తామట. నచ్చని వారి నుంచి నేర్చుకోవడానికి అసలు ఆసక్తి చూపించమట. అది ఆహార అలవాట్లు కావొచ్చూ, ఆటలూ, సంగీతం, రాజకీయ అభిప్రాయాలు... ఇలా మరేవైనా కావొచ్చు. చెప్పే వ్యక్తిపై మనకున్న అభిప్రాయాన్ని బట్టి, ఆ సమాచారం మనం నమ్ముతామా లేదా అనేది ఆధారపడి ఉంటుందని లండ్‌ యూనివర్సిటీ చేసిన తాజా అధ్యయనాల్లో నిరూపితమైంది. అందులో పాల్గొన్న వారికి రోజూ వాడే కొన్ని వస్తువులను ఇచ్చి, రకరకాల కోణాల్లో వాటి గురించి ప్రశ్నలడిగారట. వాళ్లు చెప్పిన సమాధానాల ఆధారంగా ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. నిజానికి అది తటస్థ సమాచారం అయినప్పటికీ మనం మాత్రం మనకు నచ్చిన వాళ్లు ఎలా చెప్తే అది నిజమనుకుంటామట. అలా మన మెదడు ‘ప్రోగ్రామింగ్‌’ అయింది. కాబట్టి మనం ఎదగాలన్నా, జ్ఞానం సముపార్జించాలన్నా ఎటువంటి వ్యక్తులను మనం అనుసరిస్తున్నామో గమనించుకోవాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్