ఇక చాలు అనిపిస్తోందా?

ఎంత ఏరి కోరి చేరిన ఉద్యోగమైనా... ఒకానొక దశలో ‘నా వల్ల కాదు, చేయలేకపోతున్నా’ అనిపించడం సహజమే! నిరూపించుకోవాలి, పదోన్నతి, ఫలానా స్థాయికి చేరుకోవాలి... ఇలా ఏదోక లక్ష్యంతో తదేకంగా శ్రమిస్తూ వెళుతోంటే శరీరంతోపాటు మనసూ అలసిపోతుంది. ఫలితమే ఈ ఆలోచన. అది దూరమవ్వాలంటే పని చేసే తీరు మార్చుకొని చూడండి ఇలా...

Published : 26 Feb 2024 02:13 IST

ఎంత ఏరి కోరి చేరిన ఉద్యోగమైనా... ఒకానొక దశలో ‘నా వల్ల కాదు, చేయలేకపోతున్నా’ అనిపించడం సహజమే! నిరూపించుకోవాలి, పదోన్నతి, ఫలానా స్థాయికి చేరుకోవాలి... ఇలా ఏదోక లక్ష్యంతో తదేకంగా శ్రమిస్తూ వెళుతోంటే శరీరంతోపాటు మనసూ అలసిపోతుంది. ఫలితమే ఈ ఆలోచన. అది దూరమవ్వాలంటే పని చేసే తీరు మార్చుకొని చూడండి ఇలా...

క్ష్యం ముందుకు నడిపిస్తుందన్న మాట వాస్తవమే! కానీ ఒక్కోసారి అదీ ఒత్తిడికి కారణమవుతుంది. చిన్న చిన్న టాస్క్‌లుగా విడగొట్టుకోండి. ఈరోజు, వారం, నెలలోగా... ఇంత పూర్తిచేయాలి అని పెట్టుకోండి. అప్పుడు ఉత్సాహంగా పూర్తవడమే కాదు, పని కొండలా కనిపించడమూ తగ్గుతుంది.

  • ఆడవాళ్లు మల్టీటాస్కర్లు. ఎన్ని పనులైనా ఒకేసారి చేయగలరు. అనడం చాలాసార్లు వింటుంటాం. అధ్యయనాలూ ఈ మాట చెబుతున్నాయి. అయితే... ఆ హడావుడిలో మనం పడే ఒత్తిడీ ఎక్కువే. వీలున్నంత వరకూ ఒకదాని తర్వాత ఒకటి చేయడానికే మొగ్గు చూపండి. భారం తగ్గడమే కాదు, పొరపాట్లకూ తావుండదు.
  • ఏడాదిలోగా ప్రమోషన్‌ తెచ్చుకోవాలి, నెలలోగా ఇన్ని ప్రాజెక్టులు పూర్తిచేయాలి... ఆలోచన బాగానే ఉంది. చేయాలన్న కోరికా మంచిదే! మీ శరీరం మాటేంటి? అంత భారం అది తట్టుకోగలదా? కాబట్టి, నిర్ణీత విరామాలకీ ప్రాధాన్యమివ్వండి. అప్పుడే ఈ అలసట ఉండదు.
  • ఎంత నచ్చిన వంటకమైనా రోజూ తింటే బోర్‌ కొట్టదూ? పనీ అంతే! ఎంత మెచ్చినదైనా అలసిపోయా అనిపిస్తుంది. కాబట్టి, స్కూల్లోలా ఫలానా సమయానికి ఇది అంటూ ప్లానింగ్‌ వద్దు. ఏరోజు కారోజు సరికొత్తగా ప్రణాళిక వేసుకోండి. ఈరోజు ఉత్సాహంగా ఉంది, ఎక్కువ పని చేయగలను అనిపించిందా... చేసేయండి. మనసు బాలేదు. పనిపై ఆసక్తి కలగట్లేదా? ఉత్సాహం కలిగించేలా పాట వినడమో, కొద్దిసేపు పక్కకి వెళ్లడమో, వేరే ఏదైనా పనిచేయడమో చేయండి. బలవంతంగా కొనసాగించొద్దు. అలాగే ఏమాత్రం సాయం తీసుకునే వీలున్నా మొహమాటపడొద్దు. ఓసారి మీరు కోరితే మరోసారి వాళ్లకి మీరు అండగా ఉండొచ్చు. పంచుకుంటే పనీ భారం అనిపించదు. ఇక ఉత్సాహమేగా మరి?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్