కంపెనీలు కోరుకునే నైపుణ్యం ఇదే..!

కొవిడ్‌ పరిణామాలతో పని విధానంలో చాలా మార్పులే వచ్చాయి. కృత్రిమ మేధస్సు వినియోగమూ పెరిగింది.

Updated : 27 Feb 2024 05:32 IST

కొవిడ్‌ పరిణామాలతో పని విధానంలో చాలా మార్పులే వచ్చాయి. కృత్రిమ మేధస్సు వినియోగమూ పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మారుతోన్న అవసరాలకు తగ్గట్లు నైపుణ్యాలూ మారితేనే కదా మనం ఉద్యోగంలో నిలదొక్కుకునేది. మరి కంపెనీలు ఎలాంటి వారికి ప్రాధాన్యత ఇస్తాయో తెలుసా..

అందరూ ఒకేలా ఆలోచిస్తే ఫలితాలూ ఒకేలా ఉంటాయి. పరిధులు దాటి ఆలోచించినప్పుడే కదా అద్భుతాలు సృష్టించేది! అందుకే కంపెనీలు క్రియేటివ్‌ థింకింగ్‌ ఉన్నవారిని నియమించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ చేసిన తాజా సర్వే తెలిపింది. కొత్తగా ఆలోచించడం, సమస్యలను పరిష్కరించడం, పరిస్థితులకు తగినట్లు మారగలిగే తత్త్వం... వంటి నైపుణ్యాలు ఉన్న వారిని ఎంపిక చేసుకోవడానికే సంస్థలు మొగు చూపుతున్నాయట. ఈ పోటీ ప్రపంచంలో సవాళ్లను తట్టుకుని నిలబడగలగాలంటే క్రియేటివిటీ చాలా అవసరం. ఇది మనకు చేసే పనిలో సంతృప్తినీ ఇస్తుంది. వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ ఎదగడానికీ సాయపడుతుంది. అందుకే ఎప్పుడూ కొత్త ఆలోచనలను పంచుకోవడానికీ సంకోచించకండి. కొత్త ప్రాజెక్టుల బాధ్యతలు తీసుకోవడానికీ వెనకాడొద్దు. అప్పుడే కదా మన నైపుణ్యాలూ పెరిగేది. కెరియర్‌లో దూసుకెళ్లేది!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్