ఏఐలో ఎంత వాటా...?

ఆరోగ్యం, రవాణా, ఎంటర్‌టైన్‌మెంట్‌, సైబర్‌ సెక్యూరిటీ... ఇదీ అదీ అని లేకుండా ప్రతి రంగంలోనూ కృతిమమేధ (ఏఐ) చొచ్చుకుపోయింది.

Updated : 16 Mar 2024 15:37 IST

రోగ్యం, రవాణా, ఎంటర్‌టైన్‌మెంట్‌, సైబర్‌ సెక్యూరిటీ... ఇదీ అదీ అని లేకుండా ప్రతి రంగంలోనూ కృతిమమేధ (ఏఐ) చొచ్చుకుపోయింది. అంతెందుకు... హే సిరీ, ఓకే గూగుల్‌ అనగానే ‘జీ హుజూర్‌’ అని మనకు కావాల్సిన సమాచారం ఇస్తోంది. అంతేనా... ఆన్‌లైన్‌ షాపింగ్‌, కావాల్సిన చిరునామాకు మ్యాప్‌ చూపించడం, ఫోన్‌, సిస్టమ్‌ సెక్యూరిటీ... ఇలా చెప్పుకొంటూ పోతే మరెన్నో విధాలుగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మన రోజువారీ జీవితాల్లో భాగమైపోయింది. ఇంత ప్రాముఖ్యమున్న ఈ రంగంలో మన వాటా ఎంతో తెలుసా? 22 శాతమే! వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సహా ఎన్నో సంస్థల నివేదికలు చెబుతున్న మాట ఇది. ఏఐని సమర్థంగా వినియోగిస్తున్న, పరిశోధనలు నిర్వహిస్తోన్న ఫేస్‌బుక్‌, గూగుల్‌ల్లో వరుసగా మహిళల శాతం 15, 10 మాత్రమే. కొన్నిరంగాల్లో మన వాటా ‘శూన్యం’గా ఉందంటే ఎంత వెనకబడి ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ సమస్య అవకాశాలు లేక కాదు, వాటిని అందిపుచ్చుకోవడానికి ఆసక్తి చూపుతున్న యువతులు తక్కువట. ‘అమ్మాయిలు పనికొచ్చే పనులు చేయాలి’ అని చెబుతూ టెక్నాలజీకి దూరంగా ఉంచడం వల్లే ఈ పరిస్థితి అంటున్నారు నిపుణులు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే స్టెమ్‌ (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మేథమేటిక్స్‌) రంగాల్లో అమ్మాయిల ప్రాధాన్యం పెంచడమే మార్గమంటున్నారు. దీనికి బీజం పడాల్సిందీ ప్రాథమిక స్థాయిలోనేనట. అంటే... చాలా చిన్నవయసు నుంచే సాంకేతికతలో అబ్బాయిలతో సమానంగా ప్రోత్సహించాలి మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్