ఆర్థికంగా ఎదగాలంటే...

ఎన్ని చదువులు చదివినా, ఉద్యోగం చేసినా...  ఆర్థిక ఎదుగుదల ఉంటేనే మనలో ధైర్యం ఉండేది. అయితే చిన్నతనంలో ఒంటరిగా పెరిగినవారు ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లండన్‌లోని కింగ్స్‌ కాలేజీ యువతపై చేసిన పరిశోధనలో వెల్లడైంది.

Published : 26 Mar 2024 01:57 IST

ఎన్ని చదువులు చదివినా, ఉద్యోగం చేసినా...  ఆర్థిక ఎదుగుదల ఉంటేనే మనలో ధైర్యం ఉండేది. అయితే చిన్నతనంలో ఒంటరిగా పెరిగినవారు ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లండన్‌లోని కింగ్స్‌ కాలేజీ యువతపై చేసిన పరిశోధనలో వెల్లడైంది. అటువంటి వారు ఉద్యోగాలూ, చదువులూ, శిక్షణ... లాంటి పలు అంశాల్లో వారిని వారు తక్కువగా భావిస్తున్నారట. ఆత్మవిశ్వాసం సన్నగిల్లి, ఇతరులతో పోటీపడి ఉద్యోగాలు సాధించలేకపోతున్నారట. తద్వారా సామాజికంగానూ, ఆర్థికంగానూ వెనకబడుతున్నారు. అందుకే చిన్నతనం నుంచీ పిల్లలు ఒంటరిగా ఉండకుండా నలుగురిలోనూ కలిసేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. అప్పుడే అన్ని నైపుణ్యాలనూ ఒంటపట్టించుకుని అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఆర్థికంగా ఎదుగుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్