ఏం చేయొద్దో తెలుసా?

చదువు పూర్తవుతూనే ఉద్యోగం కొట్టేయాలని కోరుకుంటాం కదా! దానికోసం సీనియర్లు, లెక్చరర్లు, తెలిసిన వాళ్లందరి సలహాలూ కోరుతుంటాం. వాళ్లూ తోచినవి చెబుతుంటారు.

Published : 06 Apr 2024 02:00 IST

చదువు పూర్తవుతూనే ఉద్యోగం కొట్టేయాలని కోరుకుంటాం కదా! దానికోసం సీనియర్లు, లెక్చరర్లు, తెలిసిన వాళ్లందరి సలహాలూ కోరుతుంటాం. వాళ్లూ తోచినవి చెబుతుంటారు. ఏం చేయాలో తెలుసుకున్నారు సరే... వేటిపై దృష్టిపెట్టొద్దో తెలుసా మరి?

‘ఎక్కువ ప్యాకేజీ’ ఉంటేనే చాలామంది దృష్టిలో మంచి ఉద్యోగం అని అర్థం. ఒక మంచి కొలువు మామూలు జీతం ఇచ్చినా, కెరియర్‌లో ముందుకు సాగడానికి అవసరమయ్యే పరిజ్ఞానాన్ని నేర్పుతుంది. అసలే తొలి ఉద్యోగం కాబట్టి, ‘ఏం నేర్చుకోగలను’ అన్నదానిపైనే మీ దృష్టి ఉండాలి. మిమ్మల్ని ఎంతవరకూ సానబెడుతుందన్న దానికి మొదటి, జీతానికి రెండో ప్రాధాన్యం ఇస్తేనే... భవిష్యత్తులో ముందుకు సాగగలరు.

  • చదువు అవ్వడం ఆలస్యం... ఇంట్లో ఎప్పుడెప్పుడు పెళ్లి చేద్దామా అన్న తొందరే. దీనికి తోడు అయినవాళ్ల నుంచి సంబంధాల విషయంలో వచ్చే సలహాలు... ఈ క్రమంలో కెరియర్‌ ఎక్కడ పక్కకు వెళుతుందోనన్న తొందర అమ్మాయిల్లో సహజమే! అందుకని కనిపించిన ఉద్యోగానికల్లా దరఖాస్తు చేయొద్దు. ఫలానా ఉద్యోగానికి ఏమేం కోరుతున్నారు, వాటికి మీ నైపుణ్యాలు, పరిజ్ఞానం సరిపడతాయా అనేది చూసుకోండి. ‘ఇది నాకు తగినది’ అనిపించాకే దరఖాస్తు చేయండి.
  • ఇంతకీ రెజ్యూమె ఉందా? ఆన్‌లైన్‌లో చేసుకున్నారా? చాలా సంస్థలు వచ్చిన దరఖాస్తుల్లో తగినవి ఎంచుకోవడానికి ప్రత్యేక టూల్స్‌ని వాడతాయి. పైగా ఒక్కో సంస్థ, ఒక్కో కొలువుకు అభ్యర్థుల నుంచి కొన్ని ప్రత్యేక లక్షణాలను కోరతాయి. కాబట్టి, కొలువును బట్టి, దీనిలోనూ మార్పులు చేసుకోవాలి. అప్పుడే పోటీలో నిలవగలుగుతారు మరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్