ఒకటే... పనులు నాలుగు!

ఏదైనా ట్రిప్‌కి వెళ్లి ‘అరెరె ఛార్జర్‌ మర్చిపోయానే’ అని ఎన్నిసార్లు అనుకొని ఉంటాం? కొన్నిసార్లు ఛార్జర్‌ ఉన్నా పెట్టుకోవడానికి వీలు ఉండదు. ఇంకొన్నిసార్లు ఫోన్‌ లైటే మన నేస్తం. ఇదేమో త్వరగా ఛార్జింగ్‌ అయిపోగొట్టేస్తుంది.

Published : 08 Apr 2024 02:21 IST

ఏదైనా ట్రిప్‌కి వెళ్లి ‘అరెరె ఛార్జర్‌ మర్చిపోయానే’ అని ఎన్నిసార్లు అనుకొని ఉంటాం? కొన్నిసార్లు ఛార్జర్‌ ఉన్నా పెట్టుకోవడానికి వీలు ఉండదు. ఇంకొన్నిసార్లు ఫోన్‌ లైటే మన నేస్తం. ఇదేమో త్వరగా ఛార్జింగ్‌ అయిపోగొట్టేస్తుంది. అబ్బబ్బా ఎన్ని ఇబ్బందులో కదా! అలాగని కొన్నిరోజుల భాగ్యానికి అన్నింటినీ బ్యాగులో పెట్టుకొని వెళ్లలేం కదా అంటారా? అయితే ఈ 4 ఇన్‌ 1 ఎల్‌ఈడీ లైట్‌ను తెచ్చుకోండి…. దీనికి ఉండే ఫ్లాష్‌లైట్ల్‌ో మూడు రకాల లైటింగ్‌ మోడ్స్‌ ఉండటం వల్ల ఎక్కువ సేపు ఛార్జింగ్‌ ఉంటుంది. చీకట్లో చక్కగా వాడుకోవచ్చు. కేబుల్‌ సాయంతో ఛార్జింగ్‌ పెట్టుకోవచ్చు. ల్యాంప్‌లానూ వాడుకునే వీలుంది. ఫోన్‌ హోల్డర్‌గా మార్చుకొని స్నేహితులతో సరదాగా రీల్స్‌ ప్రయత్నించొచ్చు, సినిమాలూ చూసేయొచ్చు. హ్యాండ్‌ బ్యాగులోనూ చక్కగా ఇమిడిపోగలదు. ప్రయాణాలకు అసలైన నేస్తంలా లేదూ? మీకూ నచ్చిందా... మరెందుకాలస్యం ఆన్‌లైన్‌ వేదికల్లో వెతికేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్