ఆకట్టుకుందామిలా..

రోజులో 10 గంటలు కార్యాలయాల్లోనే గడిచిపోతున్న గజిబిజి జీవితాలు మనవి. మరి పనిచేసే చోట సంబంధాలు ఎంత అనుకూలంగా ఉంటే చుట్టూ అంత సానుకూలంగా ఉంటుంది అంటే కాదంటారా? మరి అలాంటి వాతావరణాన్ని ఎవరూ తెచ్చిపెట్టరు.

Published : 14 Apr 2024 02:09 IST

రోజులో 10 గంటలు కార్యాలయాల్లోనే గడిచిపోతున్న గజిబిజి జీవితాలు మనవి. మరి పనిచేసే చోట సంబంధాలు ఎంత అనుకూలంగా ఉంటే చుట్టూ అంత సానుకూలంగా ఉంటుంది అంటే కాదంటారా? మరి అలాంటి వాతావరణాన్ని ఎవరూ తెచ్చిపెట్టరు. మనకు మనమే సాధించుకోవాలి. ఎలా అంటే..

  • అనుకూల వాతావరణాన్ని రూపొందించడానికి, అందరినీ ఆకట్టుకోవడానికి పెద్దపెద్ద కసరత్తులు చేయాల్సిన పనేం లేదు. మంచి పలకరింపు, చిరునవ్వు, మనకంటే తక్కువస్థాయిలో ఉన్నవాళ్లకు పనిలో మెలకువలు చెబుతూ, పెద్దవాళ్లు ఇచ్చే సలహాలు పాటిస్తే చాలు. పనిసాఫీగా సాగిపోతుంది.
  • చిన్నవాళ్లైనా, పెద్దవాళ్లైనా వారి ప్రత్యేక రోజుల్ని గుర్తుపెట్టుకుని శుభాకాంక్షలు చెప్పండి. వీలుంటే కేక్‌ కట్‌ చేయించి ఒక చిన్న పార్టీ వాతావరణాన్ని క్రియేట్‌ చేయండి. మళ్లీ వచ్చే సంవత్సరం దాకా మరచిపోరు సరికదా. మనపట్ల అభిమానమూ, గౌరవమూ పెరుగుతాయి.
  • తోటి ఉద్యోగులు పనిని త్వరగా, సమర్థవంతంగా పూర్తిచేసినప్పుడు మెచ్చుకోండి. అవసరమైతే వారిని ఎలా చేశావంటూ అడిగి తెలుసుకోండి. దీనివల్ల ఇరువురిమధ్యా స్నేహమూ బలపడుతుంది. రోజులో ఎక్కువ సమయం గడిపేచోట స్నేహపూరిత వాతావరణమా, లేదా వైరంతో ఎడముఖం, పెడముఖంతో ఉండాలా అనేది మనమీదే ఆధారపడి ఉంటుంది. మరి ఒక్కసారి ప్రయత్నించి చూడండి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్