నెలసరి కాలుష్యం లేకుండా!

నెలసరి అత్యంత సాధారణం అని తెలిసినా నేటికీ గ్రామాల్లో ఆ ప్రస్తావన వస్తే చాలు సిగ్గు పడిపోతుంటారు. ఆ సమయంలో వచ్చే అనారోగ్య సమస్యలను గురించి చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. వాటిని తగ్గించడానికి పుట్టిందే ‘ప్యూర్‌ హార్ట్స్‌’ సంస్థ.

Published : 19 Apr 2024 01:56 IST

నెలసరి అత్యంత సాధారణం అని తెలిసినా నేటికీ గ్రామాల్లో ఆ ప్రస్తావన వస్తే చాలు సిగ్గు పడిపోతుంటారు. ఆ సమయంలో వచ్చే అనారోగ్య సమస్యలను గురించి చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. వాటిని తగ్గించడానికి పుట్టిందే ‘ప్యూర్‌ హార్ట్స్‌’ సంస్థ. గ్రామాల్లో పేద మహిళలకు ఉచితంగా మెన్‌స్ట్రువల్‌ కప్స్‌ను అందిస్తూ, మహిళల ఆరోగ్యంతో పాటూ, పర్యావరణ కాలుష్యాన్నీ తగ్గిస్తుంది.

నేడు ఎక్కువ మంది మహిళలు డిస్పోజబుల్‌, శ్యానిటరీ న్యాప్‌కిన్లు వాడుతున్నప్పటికీ గ్రామాల్లో ఉండే పేదప్రజలకు వాటిని కొనే స్థోమత ఉండదు. ఆ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కూడా అంతంత మాత్రమే. దాంతో అనారోగ్యాలు కొని తెచ్చుకుంటారు. దీంతో  2019లో ‘ప్యూర్‌ హార్ట్స్‌’ అనే స్వచ్ఛంద సంస్థ గుడ్‌గావ్‌లోని మహిళలపై సర్వే చేసి ఉచితంగా మెన్‌స్ట్రువల్‌ కప్స్‌ని అందిస్తోంది. ఆశా వర్కర్లు, వలంటీర్లు, ఎస్‌హెచ్‌జీ బృందాలతో ‘ఆజాదీ- మేరీ పెహచాన్‌’ పేరుతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి, ‘మై వేస్ట్‌ ఈజ్‌ మై రెస్పాన్స్‌బిలిటి’ అనే నినాదంతో నెలసరి, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తోంది. సంవత్సరాల తరబడి భూమిలో కలవకుండా ప్రకృతికి హాని చేసే ప్లాస్టిక్‌ప్యాడ్‌లను నిషేధిస్తూ దాదాపు పదివేలమంది మహిళలని ‘కప్‌వర్ట్స్‌’(ప్యాడ్స్‌ నుంచి మెన్‌స్ట్రువల్‌ కప్స్‌కు మారేవారు)గా మార్చింది. ‘సాధారణ ప్యాడ్స్‌ ధర ఎక్కువ. పైగా వాడి పడేశాక చెత్తలా పేరుకుని ఇతరులకూ, ప్రకృతికీ హాని కలిగిస్తాయి. ప్రతీ మహిళ తన జీవితంలో సుమారు 4,400 శ్యానిటరీ ప్యాడ్స్‌ను వినియోగిస్తుంది. అంతేకాదు, గ్రామాల్లో ఉండే మహిళలు చౌకరకపు, రీయూజబుల్‌ ప్యాడ్స్‌ని ఉపయోగించడం, మార్చుకునే సమయం లేక ఎక్కువ సేపు ఒకే ప్యాడ్‌తో ఉండిపోవడం, నెలసరిలో శుభ్రత పాటించక పోవడం... వంటి కారణాల వల్ల అనేకమందికి మూత్రాశయ, జననేంద్రియ సమస్యలు వస్తున్నాయి. అదే ఈ మెన్‌స్ట్రువల్‌ కప్స్‌ను వినియోగించడం వల్ల ఆ సమస్యల నుంచి బయట పడొచ్చు. డబ్బు కూడా ఆదా అవుతుంది. గ్రామీణ మహిళలకు మెన్‌స్ట్రువల్‌ కప్‌ల వాడకం, శుభ్రత గురించి వర్క్‌షాప్‌లు నిర్వహించి వివరిస్తారు. ఇంకా ఫోనుల్లో, వాట్సప్‌ల ద్వారా సందేహాలను తీరుస్తారు మా వాలంటీర్లు. అవగాహన సదసుల్లో డాక్టర్లతో ఉచిత వైద్యపరీక్షలు నిర్వహిస్తాం’ అని ప్యూర్‌ హార్ట్స్‌కి చెందిన షాలు జోహార్‌, పూనమ్‌ అగర్వాల్‌ వివరించారు. ఈ సంస్థ ఒక ప్రశ్నావళి తయారుచేసి యుక్తవయసుపిల్లలూ, గ్రామీణ మహిళలూ రుతుచక్రంలో అనుభవిస్తున్న కష్టాలు, ఇబ్బందులు తెలుసుకుని వాటికి తగిన విధంగా ఈ మెన్‌స్ట్రువల్‌ కప్స్‌ అందుబాటులో ఉండే విధంగా అడుగులు వేస్తూ పర్యావరణాన్ని పరిరక్షిస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్