కొత్త ఉద్యోగంలో కొన్ని విషయాలు...

చదువు పూర్తవ్వగానే చాలామంది అమ్మాయిలు ఉద్యోగం వైపు అడుగులు వేస్తుంటారు. మొదట్లో ఆఫీసు వాతావరణం కొత్తగా ఉండడం వల్ల అక్కడ మసలుకోవడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఇదే కొనసాగితే మనకు గుర్తింపు తక్కువే అంటున్నారు నిపుణులు.

Published : 21 Apr 2024 01:59 IST

చదువు పూర్తవ్వగానే చాలామంది అమ్మాయిలు ఉద్యోగం వైపు అడుగులు వేస్తుంటారు. మొదట్లో ఆఫీసు వాతావరణం కొత్తగా ఉండడం వల్ల అక్కడ మసలుకోవడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఇదే కొనసాగితే మనకు గుర్తింపు తక్కువే అంటున్నారు నిపుణులు. అలాకాకుండా ఉండాలంటే...

చాలామంది పనుల్ని వాయిదా వేస్తుంటారు. ఈ అలవాటుని ఆఫీసులో కొనసాగించకండి. ఈ తీరు మీ బాస్‌కు మీపై వ్యతిరేక అభిప్రాయం ఏర్పరిచే ప్రమాదం ఉంది. ఇదీకాక గడువులోగా పని పూర్తి చేయాల్సి వస్తే... మీపై అధిక ఒత్తిడి పడుతుంది. కాబట్టి, పనులను అస్సలు వాయిదా వేయొద్దు.

  • పనిలో ఏ కాస్త విరామం దొరికినా కొందరు సామాజిక మాధ్యమాల్లో, ఫోనులో గడిపేస్తుంటారు. కొత్తలో ఏమి అనకపోవచ్చు. కానీ అదే కొనసాగిస్తే వృత్తిలో ఎదగడం కష్టమవుతుంది. అందుకే మీరే కాస్త చొరవ తీసుకుని పనికి సంబంధించి కొత్త విషయాలు నేర్చుకోవాలి.
  • ఆఫీసులో సహోద్యోగులతో సత్సంబంధాలు ఉండాలి. అలాగని పరిధి దాటకూడదు. అతిగా ఇతరుల మీద ఆధారపడటం, వారి పనిని అవసరం లేకున్నా నెత్తిన వేసుకుని చేయడం రెండూ సరికాదు. తరవాత ఎప్పుడైనా మీరు కాదన్నా, వారు చేయలేకపోయినా... మీ మధ్య దూరం పెరగొచ్చు. కాబట్టి మీరే ఎప్పటి పని అప్పుడు పూర్తి చేసుకోవడం అలవాటు చేసుకోండి. అలానే, ఇతరులకు సాయం చేయండి. కానీ, మీ వల్ల కానప్పుడు నిర్మొహమాటంగా నో చెప్పేయండి. అప్పుడే మీ ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్