మళ్లీ పెళ్లి వద్దంటోంది..!

అక్క వయసు 32. పెళ్లైన ఐదేళ్లకు బావ చనిపోయారు. వాళ్లకి మూడేళ్ల బాబు. అక్క ప్రస్తుతం మా దగ్గరే ఉంటుంది. ఉద్యోగం చేస్తోంది. మేమిద్దరం అమ్మాయిలమే. మళ్లీ పెళ్లి చేసుకోమన్నా అసలు వినడం లేదు. బాబుని సరిగా చూసుకోలేనేమో అని దిగులు పడుతోంది. అటు అమ్మానాన్నలూ ఆమె భవిష్యత్తు గురించి దిగులు పెట్టుకున్నారు. ఏం చేయాలో తెలియడం లేదు. సలహా ఇవ్వగలరు.

Updated : 22 Apr 2024 13:07 IST

ఓ సోదరి

మీ అక్క ఉద్యోగం చేస్తూ, తల్లిదండ్రుల అండతో బాబుని చక్కగా పెంచుకుంటోంది. వీటన్నింటిని బట్టి చూస్తే ఆమె ఎటువంటి అభద్రతాభావం లేకుండా జీవితం గడుపుతోందని తెలుస్తోంది. అయితే, ఆమె పెళ్లి చేసుకోను అనడానికి రెండు కారణాలు ఉండొచ్చు. ఒకటి భర్తను మర్చిపోలేక అయిండొచ్చు లేదా మళ్లీ పెళ్లి చేసుకుంటే ఆ వ్యక్తి బాబుని సరిగా చూసుకుంటారో లేదో అన్న అభద్రత వల్ల కూడా అయి ఉండొచ్చు. వేరొకరి పిల్లల్ని తమ పిల్లల్లాగా చూసుకునే విశాల దృక్పథం చాలా తక్కువమందికి ఉంటుంది. ఏది ఏమైనా ఆమె మానసికంగా సిద్ధమయ్యేంత వరకూ మీరు బలవంత పెట్టడం మంచిది కాదు. ఎందుకంటే పెళ్లి అన్నది వ్యక్తిగత విషయం. ఆ తర్వాత భర్త కుటుంబ సభ్యులు, బాధ్యతలు, అప్పుడు ఉండే ఒత్తిళ్లు ఇవన్నీ కొంచెం కష్టం అవొచ్చు. ఆమె ఆలోచించి, ముందుకు అడుగు వేయలేకపోతుండొచ్చు. ప్రస్తుత కాలంలో చాలామంది స్త్రీలు కొంచెం కష్టమైనప్పటికీ ఒంటరి తల్లిగా పిల్లల్ని బాగానే చూసుకుంటున్నారు. కాబట్టి, మీ ఆందోళనవల్ల ఆమెను బలవంతంగా అటువైపు నెట్టకండి. సరైన వ్యక్తి దొరికినప్పుడు తనే దాని గురించి ఆలోచిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్