గెలవాలంటే నేర్చుకోవాలి..

ఈ రోజుల్లో కెరియర్‌లో నిలదొక్కుకోవాలన్నా, నాయకత్వ బాధ్యతలు అందుకోవాలన్నా, మగవారికి దీటుగా దూసుకుపోవాలన్నా... కేవలం ప్రతిభ ఉంటే సరిపోదు. నలుగురినీ కలుపుకొని పోయే తత్వం, సర్దుకుపోయే గుణం, సమస్యల్ని పరిష్కరించే నేర్పరితనం అన్నీ కలగలిపి ఉండాలి. వీటినే కాదు మరికొన్ని లక్షణాలనూ అలవరుచుకోవాలి అంటారు నిపుణులు. అవేంటో తెలుసా!

Published : 22 Apr 2024 01:57 IST

ఈ రోజుల్లో కెరియర్‌లో నిలదొక్కుకోవాలన్నా, నాయకత్వ బాధ్యతలు అందుకోవాలన్నా, మగవారికి దీటుగా దూసుకుపోవాలన్నా... కేవలం ప్రతిభ ఉంటే సరిపోదు. నలుగురినీ కలుపుకొని పోయే తత్వం, సర్దుకుపోయే గుణం, సమస్యల్ని పరిష్కరించే నేర్పరితనం అన్నీ కలగలిపి ఉండాలి. వీటినే కాదు మరికొన్ని లక్షణాలనూ అలవరుచుకోవాలి అంటారు నిపుణులు. అవేంటో తెలుసా!

ద్యోగంలో చేరిన కొత్తల్లో ఉండే ఉత్సాహం చాలామందిలో ఏళ్లు గడిచే కొద్దీ కనిపించదు. కానీ, దాన్ని మీరు అందిపుచ్చుకోవాలి. ఎప్పటికప్పుడు మార్కెట్‌లో పోకడల్ని అంచనా వేయాలి. మీ సంస్థలో జరిగే పరిణామాల్నీ, భవిష్యత్తు అవసరాల్నీ అంచనా వేయడంలో ముందుండాలి. మారిన పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యాలు నేర్చుకోవాలి. అప్పుడే మీరు పోటీలో ముందుండగలరు.

  • ఒక చోట పనిచేసేటప్పుడు అందరి అభిప్రాయాలు ఒకేలా ఉండవు. కానీ, నలుగురితో కలిసి నడవాల్సి వచ్చినప్పుడు... చిన్నవాటికే కోపం తెచ్చుకోవడం, ఆ ఆక్రోశాన్ని మాటలుగా మార్చి తూటాల్లా పేల్చడం, ఇవేవీ కాదంటే కన్నీళ్లు పెట్టుకోవడం వంటివి చేయొద్దు. మీ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పడమే కాదు...ఇతరుల అభిప్రాయాన్నీ గౌరవించండి. అలాకాకుండా మీదే పై చేయి కావాలని ప్రతిదానికీ వాదులాటకి దిగడం, మిమ్మల్ని మీరు సమర్థించుకుంటూ ఉపన్యాసాలు ఇవ్వడం అంత మంచిది కాదు. మీ భావోద్వేగాలపై నియంత్రణ ఉంటే... ఉన్నత స్థాయికి చేరడం సులువే.
  • ఉద్యోగంలో రాణించడం అంత సులువేం కాదు... బోలెడన్ని ఎత్తుపల్లాలు చూడాల్సి వుంటుంది. అందుకు భయపడి సవాళ్లు తీసుకోవడానికి వెనుకాడకండి. మీరు చొరవ తీసుకోవడం, మీ బృందానికి నాయకత్వం వహించడం, పొరబాట్లు జరిగినప్పుడు నైతిక బాధ్యత తీసుకోవడానికీ జంకొద్దు. అప్పుడే మీరు నాయకత్వ స్థానాన్ని చేరుకోవడానికి అర్హురాలు అవుతారు. ఇందుకోసం సరైన ప్రణాళిక, సమయపాలన మీకున్నప్పుడు అనుకున్న లక్ష్యం చేరుకోగలరు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్