భరణం ఇవ్వాల్సొస్తుందని ఉద్యోగం మానేశాడు!

నా భర్త నిత్యం శారీరకంగా, మానసికంగా వేధిస్తుంటే భరించలేక ఇంటి గడప దాటేశా. విడాకులకు దరఖాస్తు చేశా. డివోర్స్‌ ఇస్తాను కానీ నీకు భరణం మాత్రం ఇచ్చేది లేదని అంటున్నాడు. నిరుద్యోగిగా ఉంటే మెయింటెనెన్స్‌ ఇవ్వక్కర్లేదని, ఉద్యోగానికి రాజీనామా చేసేశాడు కూడా. నేను పెద్దగా చదువుకోలేదు. బతుకుదెరువుకోసం చిన్న ఉద్యోగం చేస్తున్నా. అతనికి ఎలా బుద్ధి చెప్పగలను? సలహా ఇవ్వగలరు.

Published : 23 Apr 2024 19:09 IST

నా భర్త నిత్యం శారీరకంగా, మానసికంగా వేధిస్తుంటే భరించలేక ఇంటి గడప దాటేశా. విడాకులకు దరఖాస్తు చేశా. డివోర్స్‌ ఇస్తాను కానీ నీకు భరణం మాత్రం ఇచ్చేది లేదని అంటున్నాడు. నిరుద్యోగిగా ఉంటే మెయింటెనెన్స్‌ ఇవ్వక్కర్లేదని, ఉద్యోగానికి రాజీనామా చేసేశాడు కూడా. నేను పెద్దగా చదువుకోలేదు. బతుకుదెరువుకోసం చిన్న ఉద్యోగం చేస్తున్నా. అతనికి ఎలా బుద్ధి చెప్పగలను? సలహా ఇవ్వగలరు...

ఓ సోదరి

మీరు విడాకుల కేసు వేసినప్పుడు అందులో మీ పెళ్లి జరిగినప్పుడు ఇచ్చిన కట్నకానుకల గురించి ప్రస్తావించారా? హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌ 13(1ఎ) ప్రకారం క్రూరత్వాన్ని కారణంగా చూపుతూ మీరు విడాకులు కోరవచ్చు. అలానే, సెక్షన్‌ 24 కింద విడాకుల కేసు పెండింగ్‌లో ఉన్నప్పుడూ మీరు నెలసరి భత్యం ఇప్పించమని అడగవచ్చు. మీ భర్తకి ఉద్యోగం చేయగల సామర్థ్యం ఉండి కూడా కేవలం మెయింటెనెన్స్‌ ఇవ్వాల్సి వస్తుందని మానేస్తే ఆ విషయం కోర్టులో నిరూపించవచ్చు. కేసు వేశాక...ఉద్యోగం మానేశాడన్న సంగతీ, ముందు సంపాదించిన జీతభత్యాల వివరాలూ, అందుకు సంబంధించిన కాగితాలూ సంపాదించి కోర్టులో చూపించండి. లేదా తన సహోద్యోగులెవరితోనైనా సాక్ష్యం చెప్పించండి. అలానే, హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌-25 ప్రకారం... శాశ్వత భరణాన్ని ఏకమొత్తంలో ఇప్పించమని కోర్టుని అడగండి. విడాకుల కేసుతో పాటే దీనిపైనా నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ డివోర్స్‌ కేసుని కొట్టేస్తే... దీనిపైనా నిర్ణయం జరగదు. ప్రస్తుతం మీ భర్త ఉద్యోగం చేయట్లేదు కాబట్టి నెలసరి భత్యం ఇవ్వమని కోర్టు నిర్ణయించకపోతే తరవాతా ప్రయత్నించొచ్చు. ఆపై పరిస్థితులు మారి అతడు మళ్లీ ఉద్యోగంలో చేరితే మీ అవసరాలు చూపించి అతని మీద సెక్షన్‌ 125 సీఆర్‌పీసీ కింద మెయింటెనెన్స్‌ కేసు వేయవచ్చు. అతడి మోసాలకు శిక్ష పడాలనుకుంటే వరకట్న వేధింపులు, గృహహింస కిందా కేసు వేయొచ్చు. ఏదైనా మీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్