రంగులు తెలిసేలా!

పిల్లలకు సెలవులిచ్చేశారు. ఎండ వేడిమికి చిన్నారుల అల్లరి తోడై తల్లిదండ్రులకు తలనొప్పి మొదలైపోయింది. వాళ్లని ఎలా నియంత్రించాలో తెలియక సతమతమయ్యేవారికి నిపుణులు కొన్ని ఆటలు సూచిస్తున్నారు. ఇవి వారిలో ఉత్సాహంతో పాటు విజ్ఞానాన్నీ పెంచుతాయి.

Updated : 24 Apr 2024 14:08 IST

పిల్లలకు సెలవులిచ్చేశారు. ఎండ వేడిమికి చిన్నారుల అల్లరి తోడై తల్లిదండ్రులకు తలనొప్పి మొదలైపోయింది. వాళ్లని ఎలా నియంత్రించాలో తెలియక సతమతమయ్యేవారికి నిపుణులు కొన్ని ఆటలు సూచిస్తున్నారు. ఇవి వారిలో ఉత్సాహంతో పాటు విజ్ఞానాన్నీ పెంచుతాయి. ఓ సారి ప్రయత్నించి చూడండి.

ఈ రోజు పిల్లలతో రంగులాట ఆడించేద్దాం! నీలం, ఎరుపు, పసుపు వర్ణాలనూ... కలర్‌ మిక్సింగ్‌ కోసం కొన్ని పేపర్లూ, బ్రష్‌ లేదా స్పాంజ్‌, ట్రేలు ఇవ్వండి. ఇప్పుడు నచ్చిన పరిమాణాల్లో కలర్స్‌ని మిక్స్‌ చేసి... కొత్త రంగులు సృష్టించమనండి. అప్పుడు ఆకుపచ్చ, ఊదా వంటి రంగులెన్నో పుట్టుకొస్తాయి. లేదంటే మూడు గాజు గ్లాసుల్లోకి నీళ్లు తీసుకుని అందులో ఫుడ్‌ కలర్స్‌ని కలపండి. వాటిని రకరకాలుగా ఖాళీ గ్లాసుల్లో మిక్సింగ్‌ చేయించి ఐస్‌ ట్రేలో పోయించి క్యూబ్స్‌లా చేయించండి. అలానే, రంగుల మిక్సింగ్‌తో ఓ వస్త్రంపై నచ్చినట్లు బొమ్మలేయించండి. ఇలా వేసిన ఆ ఆర్ట్‌ని అందంగా ఫ్రేమ్‌ చేయించి గోడకు తగిలిస్తే సరి. అదెప్పటికీ ఓ మంచి జ్ఞాపకంగా ఉండిపోతుంది. ఇదంతా వారికి కొత్తగానూ, ఉత్సాహంగానూ ఉంటుంది. వారిలో ఊహా శక్తి పెరుగుతుంది. వీటితోనే కాదు రంగుల ఇసుకతోనూ ఈ ప్రయోగం చేయొచ్చు.

ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఎలాంటి నైపుణ్యాలు నేర్పించాలనుకుంటున్నారు?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్