సరదా తప్పులు!

వేయి సూక్తులు విన్నా చలించని వాళ్లు ఉంటారేమో కానీ, హాస్యాన్ని ఆస్వాదించని వారుండరంటే అతిశయోక్తి కాదు!

Published : 05 May 2024 03:22 IST

వేయి సూక్తులు విన్నా చలించని వాళ్లు ఉంటారేమో కానీ, హాస్యాన్ని ఆస్వాదించని వారుండరంటే అతిశయోక్తి కాదు! అందుకే ‘నవ్వని రోజు వృథా అయినట్టే’ అని చార్లీ చాప్లిన్‌ అంటే, ‘జీవితమంటే అలా బతికేయడమే కాదు, అందులో కొంత హాస్యం కూడా ఉండా’లంటారు అమెరికా రచయిత్రి మయా ఏంజెలో. అమ్మాయంటే ఇలానే నవ్వాలి... అనే రోజుల నుంచి హాస్యాన్నే తమ కెరియర్‌గా మలుచుకుంటోన్న అమ్మాయిలూ పెరిగారు. ఫటాఫట్‌ పంచులు వేసినా, స్టాండప్‌ కామెడీ చేసినా... వారి అంతిమ లక్ష్యం ఎదుటి వారి ముఖంలో నవ్వులు పూయించడమే. సాధారణంగా మనమెవరైనా తప్పులు చేశామనుకోండి అందులో ఫన్‌కి పెద్దగా ఆస్కారం ఉండదు. కానీ యూట్యూబర్లు, నటీనటులు, న్యూస్‌ రీడర్లు... లాంటి వాళ్లు వీడియో రికార్డింగ్‌ చేసేటప్పుడు దొర్లే తప్పులు అవేనండీ ‘బ్లూపర్స్‌’... అందరినీ కడుపుబ్బా నవ్విస్తాయి. సైకలాజికల్‌గా చెప్పాలంటే... ఇలా సరదా తప్పులకు నవ్వే పద్ధతిని ‘బినైన్‌ వయొలేషన్‌ థియరీ’ అంటారు. నిజానికి వాళ్లు చేసే ఆ కార్యక్రమాన్ని ఎంతమంది చూస్తారో తెలియదు కానీ, ఆ బ్లూపర్‌ వీడియోలు మాత్రం తెగ వైరల్‌ అవుతుంటాయి. మిలియన్ల కొద్దీ వీక్షణలు సొంతం చేసుకుంటుంటాయి!  ఉదాహరణకు ఓ న్యూస్‌ రీడర్‌ సీరియస్‌గా వార్తలు చదువుతున్నప్పుడు మధ్యలో వాళ్ల బాబు లేదా పాప వచ్చి డిస్టర్బ్‌ చేస్తే... ఏమవుతుందో ఒక్కసారి ఊహించుకోండి. లైవ్‌ ఆగిపోయిందనుకుని యాంకర్‌ మరేదో విషయం మాట్లాడుతుంటే... నవ్వులే నవ్వులు!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్