నవ్వుతూ మాట్లాడితే... అంత అలుసా?

కొత్తగా నాయకత్వ బాధ్యతలు అందుకున్నా. పెత్తనం చేస్తున్నట్లుగా ఉండొద్దని అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నా. ఇలాగైతే పని త్వరగా అర్థమవుతుందన్న కారణమూ లేకపోలేదు.

Updated : 22 May 2024 13:50 IST

కొత్తగా నాయకత్వ బాధ్యతలు అందుకున్నా. పెత్తనం చేస్తున్నట్లుగా ఉండొద్దని అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నా. ఇలాగైతే పని త్వరగా అర్థమవుతుందన్న కారణమూ లేకపోలేదు. కానీ నా చొరవను కొందరు మగవాళ్లు అలుసుగా తీసుకుంటున్నారు. నవ్వుతూనే ఇబ్బందికర కామెంట్లు చేస్తున్నారు. టీమ్‌ వాతావరణం చెడకుండా వాళ్లకు వార్నింగ్‌ ఇవ్వడమెలా?

 ఓ సోదరి

నాయకత్వ స్థానాల్లో ఉన్న చాలామంది మహిళలు ఈ ‘లైకబిలిటీ’ అనే ఉచ్చులో పడుతుంటారు. అందరిలో మంచివాళ్లుగా పేరొందాలనుకునే తాపత్రయమే ఇది. అయితే, నాయకత్వం అంటే అదొక్కటే కాదు కదా! అవసరమైనప్పుడు కచ్చితత్వంతోనూ, డిమాండింగ్‌గానూ ఉండాలి. కచ్చితత్వంతో ఉండడానికీ, అందరూ ఇష్టపడేలా ఉండడానికీ మధ్య సన్నని వ్యత్యాసం ఉంటుంది. మహిళా నాయకురాలిగా ఈ రెండింటినీ సమన్వయం చేసుకోవడం సవాలే. ఎందుకంటే ఎక్కడ మన గురించి చెడుగా అనుకుంటారో అనే భయం. దాంతో బృంద సభ్యులే ఇలా ఇబ్బందికర కామెంట్లు చేస్తున్నా ఏమీ అనలేకపోతారు. ముందు మీరు ఎలాంటి సంశయాలు లేకుండా వాళ్లతో నేరుగా మాట్లాడండి. టీమ్‌ సభ్యులు ఎలా ప్రవర్తించాలనే విషయాన్ని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పండి. మీ మధ్య ఆరోగ్యకరమైన హద్దులూ పెట్టుకోండి. వాటిని వాళ్లు దాటకుండా చూడండి. అప్పుడే మీరు పనిచేయగలుగుతారు. వాళ్లతోనూ పనిచేయించగలుగుతారు. ఎన్ని చెప్పినా వాటిని పాటించని వాళ్లూ ఉంటారు. అటువంటి వాళ్లను ఎలా డీల్‌ చేయాలన్నదీ ముందే ఆలోచించుకోవాలి. దానివల్ల ఇలాంటివి మరెప్పుడైనా ఎదురైతే తేలిగ్గా ఎదుర్కోగలుగుతారు. దాన్ని చూసైనా మిగతావారు జాగ్రత్తగా, హుందాగా మసలుకుంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్