బర్నవుట్‌ అవుతున్నారా..!

ఆఫీసు వర్క్‌ చేస్తున్నప్పుడు రంజనికి అకస్మాత్తుగా మధ్యలో పని ఆపేయాలనిపిస్తుంది. రొటీన్‌గా అనిపించి తీవ్ర ఒత్తిడికి లోనవుతుంది. దీన్నే బర్నవుట్‌ అంటున్నారు నిపుణులు. ఇందులోంచి బయటపడే మార్గాలను సూచిస్తున్నారు.

Published : 23 May 2024 01:22 IST

ఆఫీసు వర్క్‌ చేస్తున్నప్పుడు రంజనికి అకస్మాత్తుగా మధ్యలో పని ఆపేయాలనిపిస్తుంది. రొటీన్‌గా అనిపించి తీవ్ర ఒత్తిడికి లోనవుతుంది. దీన్నే బర్నవుట్‌ అంటున్నారు నిపుణులు. ఇందులోంచి బయటపడే మార్గాలను సూచిస్తున్నారు.

ప్రస్తుతం పనిలో వేగాన్ని పెంచుకోవడం అనివార్యమైంది. పోటీ కూడా పెరిగింది. అయితే ఈ వేగానికి అతిచేరువలోనే బర్నవుట్‌ పొంచి ఉంటుంది. ఈ రెండింటి మధ్య సన్నని గీత ఉంటుంది. మొత్తం పనిని వేగంగా పూర్తిచేయాలని ప్రయత్నిస్తూ, తెలియకుండానే మెదడుకు ఒత్తిడి కలిగిస్తాం. పనిలో ఇలా కాస్తంత కూడా విరామం లేకుండా నిరంతరం వేగంగా కొనసాగించుకుంటూ పోతే క్రమేపీ అది అలసట, ఒత్తిడికి దారి తీస్తుంది. దీంతో పనిపై నిర్లిప్తత మొదలవుతుంది. అశ్రద్ధచేస్తే ఈ స్థితి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది.

విభజించాలి... విధుల్లో భాగంగా ఉత్పాదకత పెరిగేలా జాగ్రత్త పడుతూనే ప్రాముఖ్యతను బట్టి పనులను విభజించగలిగే నైపుణ్యాలను పెంచుకోవాలి. ఇతరులు చేయగలిగేవాటిని వారికే అప్పగించాలి. వాటిని పర్యవేక్షిస్తే పనిభారం తగ్గుతుంది. మానసిక ఒత్తిడీ దూరమవుతుంది.

తక్షణం కాకపోతే... కొన్ని పనులు ముఖ్యమైనవే అయినా.. వెంటనే చేయాల్సిన అవసరం ఉండదు. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పూర్తిచేయాల్సిన ప్రాజెక్టులుంటాయి. వీటిని వ్యూహాత్మకంగా, ప్రణాళికాబద్ధంగా చేయాలి. దీనికంటూ రోజూ కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. ప్రశాంతంగా పూర్తి చేసే పనుల్లో సత్ఫలితాలుంటాయి.

ప్రతి రోజూ... ఆఫీసుకు రాగానే ఆ రోజు చేయాల్సిన పనులను అత్యవసరం, అవసరం అంటూ విభజించుకోవాలి. వాటిని ప్రణాళికమేరకు పూర్తిచేయగలగాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి, ధ్యానం, వ్యాయామాలకు చోటివ్వాలి. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్