అన్నీ ఉన్నా... అసంతృప్తే.. ఎందుకలా చేస్తోంది?

నా స్నేహితురాలు అందంగా ఉంటుంది. బాగా చదువుతుంది కూడా. అమ్మానాన్నలు ఆస్తిపరులే. అయినా ఎప్పుడూ అసంతృప్తిగానే ఉంటుంది. ఇతరులకు పొరపాటున కూడా సాయపడదు. ఎవరైనా జోక్స్‌ వేసుకున్నా తన గురించే అని ఫీలవుతుంటుంది.

Updated : 27 May 2024 16:18 IST

నా స్నేహితురాలు అందంగా ఉంటుంది. బాగా చదువుతుంది కూడా. అమ్మానాన్నలు ఆస్తిపరులే. అయినా ఎప్పుడూ అసంతృప్తిగానే ఉంటుంది. ఇతరులకు పొరపాటున కూడా సాయపడదు. ఎవరైనా జోక్స్‌ వేసుకున్నా తన గురించే అని ఫీలవుతుంటుంది. ఎందుకలా చేస్తుంది?

ఓ సోదరి

కొంతమందికి తెలివితేటలతో పాటు జీవితంలో సౌకర్యాలన్నీ అమరి ఉంటాయి. దాంతో వాళ్లు వేరే వ్యాపకాలేమీ లేకుండా చక్కగా చదువుతూ ఉండి ఉండొచ్చు. అలా అని వాళ్లు ఎప్పుడూ సంతోషంగా ఉంటారనుకోవడం అపోహ మాత్రమే. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏదో ఒక లోపం ఉంటుంది కదా! తనతో సరితూగే స్నేహితులు లేకపోవడం లేదా మరేదో కారణం వల్ల ఆమె మనశ్శాంతిగా ఉండకపోవచ్చు. కొంతమంది తల్లిదండ్రులు తమ కంటే తక్కువ స్థితిలో ఉన్న పిల్లలతోనూ వారి పిల్లలను కలవనీయరు. సాయం చేయడానికి కూడా ఒప్పుకోకపోవచ్చు. అందుకే తను ముందుకు వచ్చి సాయం చేసే పరిస్థితిలో లేకుండొచ్చు. ఇతరులతో ఏ విధంగా కలవాలి? ఎవరికి సాయం చేయాలి? అనే అనుభవం లేకపోవడం వల్ల కూడా ఎవరికీ సాయం చేస్తూ ఉండక పోవచ్చు. కాబట్టి బయట నుంచి చూసి మీరు ఆ అమ్మాయికి చెడు గుణాన్ని ఆపాదించడం మంచిది కాదు. ఆ అమ్మాయి కారణాలు ఆ అమ్మాయికి ఉండొచ్చు. కాబట్టి ఎవర్నీ ఎవరితో పోల్చి చూడకూడదు. తను ఎలా ఉన్నా కలిసినప్పుడు ఆమెతో స్నేహంగా ఉండండి. తనను తప్పు పట్టినట్టు ఉండనవసరం లేదు. ఇంకొకరిని జడ్జ్‌ చేసేముందు అన్ని కోణాల్లో ఆలోచించగలగాలి. అంతే తప్ప అపోహలతో మనసులు పాడుచేసుకోకూడదు. అయినా సాయం చేయడానికి బీద, ధనిక అన్న భేదం ఉండదు. ఎవరికి ఏ సమయంలో అవసరం వస్తే చిన్నదైనా పెద్దదైనా మనం చేయగలిగినంత చేయాలి. అంతేకానీ అందులో ఇంకొకరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్