ఇంకా సెక్రటరీలానే చూస్తున్నారు..!

నేను 15ఏళ్లు ఒక కంపెనీలో సెక్రటరీగా పనిచేశాను. ఈమధ్యే అదే సంస్థలో నా పోస్టు మారింది. కానీ, మా మేనేజర్‌ మాత్రం నన్ను ఇదివరకు స్థాయిలోనే చూస్తున్నారు. నాలోని ప్రతిభను గుర్తించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఎలా పనిచేయాలో తెలియడం లేదు.

Updated : 05 Jun 2024 13:16 IST

నేను 15ఏళ్లు ఒక కంపెనీలో సెక్రటరీగా పనిచేశాను. ఈమధ్యే అదే సంస్థలో నా పోస్టు మారింది. కానీ, మా మేనేజర్‌ మాత్రం నన్ను ఇదివరకు స్థాయిలోనే చూస్తున్నారు. నాలోని ప్రతిభను గుర్తించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఎలా పనిచేయాలో తెలియడం లేదు.

ఓ సోదరి

ఎవరైనా సరే... మనలోని నైపుణ్యాలతో సంబంధం లేకుండా మనల్ని అంచనా వేస్తున్నారంటే అది బాధపెట్టే విషయమే. 15ఏళ్లు అడ్మినిస్ట్రేటివ్‌ విభాగంలో పనిచేసిన తర్వాత తిరిగి అక్కడే వేరే హోదాలో పనిచేయడం, ఆ కొత్త పరిస్థితులకు తగినట్లు నడుచుకోవడం ఎవరికైనా ఒకింత సవాలే. ఎందుకంటే, ఇన్నేళ్లుగా మీ మీద ఆధారపడ్డ మీ మేనేజర్, సహచరులు మిమ్మల్ని ఇంకా అదే స్థాయిలోనే చూస్తుండొచ్చు. ఇటువంటి మూస పద్ధతులు మన ఎదుగుదలకు ఆటంకాలుగా మారతాయి. బహుశా సంస్థలో మరే హోదాలో అయినా మీరు ఎదగడానికి మార్గం ఉందేమో చూడండి. లేదా, మరేదైనా కొత్త కంపెనీకి మారండి. ఎందుకంటే, అక్కడ అంతా కొత్త వాళ్లు అవడం వల్ల మీ నైపుణ్యాలను మరింతగా అర్థంచేసుకోవచ్చు. అక్కడ మీరు మరింత వేగంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ, ఇప్పుడున్న కంపెనీలోనే కొనసాగాలనుకుంటే ముందు మీ మేనేజర్‌తో ఒకసారి మాట్లాడండి. అయితే, ఎప్పటిలా ఆఫీసులో కాకుండా ఒక ప్రత్యేకమైన మీటింగ్‌ ఏర్పాటుచేసుకోండి. పూర్తిగా మిమ్మల్ని మీరు కొత్తగా ప్రెజెంట్‌ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆమె మనసులో మీ మీద ఉన్న ముద్రను చెరిపేయండి. అందుకు మన  నైపుణ్యాలతోపాటు అప్పియరెన్సూ ముఖ్యమే. ఆఫీసులో మీ తోటి ఉద్యోగులు ఎలా డ్రెస్‌అప్‌ అవుతున్నారో గమనించి అలానే మీరూ ఈ మీటింగ్‌కూ సిద్ధమవ్వండి. మీరు గతంలో చేసిన పనినీ, మీలోని నైపుణ్యాలనూ తనకు అర్థమయ్యేలా సంక్షిప్తంగా చెప్పండి. మీరు తన టీమ్‌లో పనిచేయడం వల్ల ఆమెకు, తద్వారా కంపెనీకి ఎంత ఉపయోగపడతారనేదీ వివరించండి. ఆత్మవిశ్వాసంతో మాట్లాడండి. అప్పుడు తను సానుకూలంగా ఆలోచించి సహకరించే అవకాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్