కొలెస్ట్రాల్‌ తగ్గేదెలా?

నా వయసు 36 ఏళ్లు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిని. చూడ్డానికి సన్నగానే ఉంటా. కానీ, ఈ మధ్య పరీక్షలు చేయించుకుంటే కొలెస్ట్రాల్‌ 270 ఉందన్నారు. డాక్టరు టాబ్లెట్‌ ఇచ్చినప్పటికీ ప్రధానంగా ఆహారంలో మార్పులు చేసుకోమని సూచించారు. నేనెలాంటి డైట్‌ పాటించాలి?

Updated : 06 Jun 2024 12:59 IST

నా వయసు 36 ఏళ్లు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిని. చూడ్డానికి సన్నగానే ఉంటా. కానీ, ఈ మధ్య పరీక్షలు చేయించుకుంటే కొలెస్ట్రాల్‌ 270 ఉందన్నారు. డాక్టరు టాబ్లెట్‌ ఇచ్చినప్పటికీ ప్రధానంగా ఆహారంలో మార్పులు చేసుకోమని సూచించారు. నేనెలాంటి డైట్‌ పాటించాలి? 

శ్రావణి, చిత్తూరు

మీ ఎత్తుగానీ, బరువుగానీ చెప్పలేదు. సన్నగా ఉన్నంత మాత్రాన మనం ఆరోగ్యంగా ఉన్నామని నిర్ధారించలేం. ఎందుకంటే కొందరికి హార్మోనుల్లో అసమతుల్యత, థైరాయిడ్‌ వంటివి కారణం కావచ్చు. అంతేకాదు, జన్యుపరంగా కూడా, ఈ కొలెస్ట్రాల్‌ పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా మన దేశంలో స్త్రీలకు నడుము చుట్టుకొలత 80 సెంటీమీటర్లకు మించకూడదు. ఒకవేళ ఉందంటే మీ శరీరంలో కొలెస్ట్రాల్‌ పెరుగుతున్నట్లు గుర్తించాలి. దీనివల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశమూ ఉంది. అలాగే తీసుకునే ఆహారంలో చక్కెర తగ్గించాలి. బయట ఆహారానికీ, బేకరీ ఫుడ్స్‌కీ వీలైనంత దూరంగా ఉండాలి. చాక్లెట్స్, కూల్‌డ్రింక్స్‌ పూర్తిగా మానేయాలి. రోజూ తీసుకునే ఆహారంలో పీచు ఎక్కువ ఉండేటట్లు చూసుకోవాలి. ఇందుకు పాలిష్‌పట్టని గింజధాన్యాలు, తృణధాన్యాలను మాత్రమే వినియోగించాలి. ఒకపూట భోజనంలో రైస్‌ తీసుకున్నా రాత్రికి మల్టీగ్రెయిన్‌ రోటీ, జొన్నరొట్టె వంటివి తీసుకుంటే మంచిది. మీ బరువుని బట్టి మీ శరీరానికి ఎన్ని కెలోరీలు అవసరమో పోషకాహార నిపుణులను సంప్రదించి తీసుకోవాలి. వీటితో పాటూ 150 గ్రా. పండ్లు ఏదోఒక సమయంలో తినాలి. పెసలు, అలసందలు, బొబ్బర్లు, సెనగలను ఉడికించి సలాడ్‌ రూపేణా సాయంత్రం చిరుతిండిగా తింటే కడుపు నిండుగా ఉండి ఆకలి నియంత్రణలో ఉంటుంది. బీన్స్, క్యారెట్, బెండకాయ, ఆకుకూరల ద్వారా పీచుపదార్థం ఎక్కువగా లభిస్తుంది. మాంసాహారులైతే 150గ్రా. చేపలు, 100గ్రా. చొప్పున చికెన్, రెడ్‌మీట్‌ను తక్కువ నూనెతో వండి, గ్రేవీ లేకుండా తినాలి. ప్రతి మూడునెలలకోసారి వంట నూనెను మారుస్తూ ఉండాలి. వీటితోపాటు శారీరక వ్యాయామాలు చేస్తే కొలెస్ట్రాల్‌ నియంత్రణలోకి వస్తుంది. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్