నేర్చుకుంటేనే గెలవగలం!

తమ కలల్ని నెరవేర్చుకుంటూ కోరుకున్న ఉద్యోగంలో కుదురుకున్నా... పదోన్నతులు అందుకోవడంలో కొందరు వెనకబడుతుంటారు. ఇలాంటప్పుడు పనితీరుని సమీక్షించుకోవడం చాలా అవసరం. అదెలాగంటే... లక్ష్యాలకు తగ్గ ప్రణాళిక: ప్రతి ఒక్కరికీ కొన్ని లక్ష్యాలు ఉండాలన్నది నిజమే అయినా.

Published : 09 Jun 2024 04:27 IST

తమ కలల్ని నెరవేర్చుకుంటూ కోరుకున్న ఉద్యోగంలో కుదురుకున్నా... పదోన్నతులు అందుకోవడంలో కొందరు వెనకబడుతుంటారు. ఇలాంటప్పుడు పనితీరుని సమీక్షించుకోవడం చాలా అవసరం. అదెలాగంటే... 

క్ష్యాలకు తగ్గ ప్రణాళిక: ప్రతి ఒక్కరికీ కొన్ని లక్ష్యాలు ఉండాలన్నది నిజమే అయినా... వాటిని సాధించడానికి మీ దగ్గర సరైన ప్రణాళిక ఉందో లేదో చూసుకోండి. ఎందుకంటే విజయతీరాలకు చేరినవారందరికీ స్పష్టమైన ఆలోచన, ప్లాన్‌ తప్పనిసరిగా ఉంటాయి మరి. అదీ డాక్యుమెంటేషన్‌ అయి ఉండాలి. లేదంటే... మీ ఆలోచనలన్నీ నీటిమీద రాతలే అవుతాయి.

కాలంతో పోటీపడాలి: ప్రణాళిక వేసుకోగానే విజయం మీ చెంతకి వచ్చేయదు. కాలంపై పట్టు, పనిపై అవగాహన కూడా ఉండాలి. ఎంత కష్టమైనా సరే, అనుకున్న గడువు కంటే ముందు చేయగలగాలి. ఇది ఒక్కసారిగా అలవడకపోవచ్చు. కానీ, ప్రయత్నిస్తే సాధ్యమే. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కాలం కంటే వేగంగా పరుగెడితేనే గమ్యాన్ని చేరుకునేది.  

నేర్చుకోండి: ఉద్యోగంలో చేరాం హమ్మయ్య అనుకుని సరిపెట్టేసుకోకండి. ఎప్పటికప్పుడు మార్కెట్‌ పోకడల్ని తెలుసుకుంటూ నైపుణ్యాలను ఒంట పట్టించుకోవాలి. ప్రముఖ సంస్థలు అప్పుడప్పుడూ శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంటాయి. అలాంటి వాటిని వినియోగించుకుని నైపుణ్యాలతో పాటు జీవన నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి. 

విశ్లేషించుకోండి... చిన్న విజయానికే పొంగిపోవడం, వెనకబడినప్పుడు కుంగిపోవడం సరికాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మానసిక స్థైర్యాన్ని కోల్పోకూడదు. పొరపాటు జరిగితే కారణాలను నిశితంగా పరిశీలించుకోవాలి. విశ్లేషించుకుని... మరోసారి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే పనిలో నైపుణ్యం సాధించడంతో పాటు పదోన్నతులూ అందుకోగలుగుతారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్