అందుకే అమ్మాయిలకు గుండు.. అబ్బాయిలకు పొడవైన జుట్టు..!

మనసుకు నచ్చిన వాడు.. మంచి మనసున్న వాడు.. భర్తగా రావాలని ప్రతి అమ్మాయీ కోరుకుంటుంది. ఈ క్రమంలోనే పండగలప్పుడు ఉపవాసం ఉండడం, ప్రత్యేక పూజలు చేయడం, నోములు-వ్రతాలు చేయడం.. వంటివి కొంతమందికి అలవాటే! ఇక కాబోయే వాడికి నచ్చాలని అందం, కేశ సౌందర్యంపై ప్రత్యే....

Published : 06 Feb 2023 14:33 IST

మనసుకు నచ్చిన వాడు.. మంచి మనసున్న వాడు.. భర్తగా రావాలని ప్రతి అమ్మాయీ కోరుకుంటుంది. ఈ క్రమంలోనే పండగలప్పుడు ఉపవాసం ఉండడం, ప్రత్యేక పూజలు చేయడం, నోములు-వ్రతాలు చేయడం.. వంటివి కొంతమందికి అలవాటే! ఇక కాబోయే వాడికి నచ్చాలని అందం, కేశ సౌందర్యంపై ప్రత్యేక దృష్టి పెడుతుంటారు. అయితే ఆ తెగలో మాత్రం తమకు యోగ్యుడైన వరుడు భర్తగా రావాలని.. పెళ్లికి ముందే అతివలు గుండు చేయించుకుంటారట! అక్కడి అమ్మాయిల సంగతి ఇలా ఉంటే.. అబ్బాయిలేమో అమ్మాయిలకు నచ్చడం కోసం జుట్టును బారుగా పెంచుతూ.. వాటి సౌందర్య పోషణపై ప్రత్యేక దృష్టి పెడతారట! వినడానికి వింతగా, ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది ఆ తెగలో ప్రాచీన కాలం నుంచి సంప్రదాయంగా వస్తోందట! ఇంతకీ ఏంటా తెగ? ఎక్కడుంది? అక్కడి మహిళలు పాటిస్తోన్న వింత ఆచారాలేంటి? తెలుసుకోవాలంటే.. ఇది చదివేయండి!

అమ్మాయిలకు గుండు.. అబ్బాయిలకు జుట్టు!

రాబోయే వరుడి విషయంలో కెన్యాకు చెందిన బొరానా తెగ మహిళలకు ఓ వింత నమ్మకం ఉంది. పెళ్లికి ముందు గుండు చేయించుకుంటే.. తమకు గుణవంతుడైన వాడు భర్తగా దొరుకుతాడని అక్కడి వారి నమ్మకం. అయితే ఈ నమ్మకం ఈనాటిది కాదు.. ప్రాచీన కాలం నుంచే అక్కడి అమ్మాయిలు ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నారట! ఇక అమ్మాయిల సంగతి ఇలా ఉంటే.. అబ్బాయిలు ఇందుకు పూర్తి భిన్నమైన సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. వాళ్లు తమ జుట్టు సౌందర్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతుంటారట! ఈ క్రమంలో జుట్టును ఒత్తుగా, పొడవుగా పెంచుకోవడానికి ప్రాధాన్యమిస్తుంటారు. జుట్టు పోషణ కోసం నెయ్యి, వెన్న.. వంటివి కూడా ఉపయోగిస్తుంటారట! ఇలా తమకు ఒత్తైన జుట్టుంటేనే అమ్మాయిలు ఇష్టపడతారని అక్కడి అబ్బాయిల నమ్మకమట!

చిన్నతనం నుంచే..

ఇక ఈ తెగలో పెళ్లీడుకొచ్చిన అమ్మాయిల సంగతి ఇలా ఉంటే.. బాలికలు, యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు మరో రకమైన హెయిర్‌స్టైల్‌ను పాటిస్తుంటారట! ఈ క్రమంలో తల చుట్టూ ఉన్న వెంట్రుకల్ని షేవ్‌ చేసుకొని.. కేవలం మధ్య భాగంలో ఉన్న జుట్టుతోనే జడ వేసుకోవడం (అండర్‌కట్‌ హెయిర్‌స్టైల్‌ మాదిరిగా), బన్‌ హెయిర్‌స్టైల్‌ వేసుకోవడం.. వంటివి చేస్తుంటారట అక్కడి అమ్మాయిలు. కెన్యాలోని ఇథియోపియా, సోమాలియా.. వంటి దేశాల్లో ఎక్కువగా కనిపించే ఈ తెగలో అమ్మాయిలకు చిన్నతనం నుంచే ఇంటి పనులు, వంట పనుల్ని అలవాటు చేస్తుంటారట! అందుకే అక్కడి అమ్మాయిల్ని పెంచే బాధ్యత ముఖ్యంగా అమ్మలే తీసుకుంటారట! ఇక బొరానా తెగలో ఎటు చూసినా చెక్క-మట్టితో నిర్మించిన ఇళ్లే కనిపిస్తాయి. వాటిని నిర్మించే బాధ్యత కూడా మహిళలదేనట! ఇక పురుషులు మాత్రం తమ భార్యాపిల్లల్ని, కుటుంబాన్ని పోషించడానికి వ్యవసాయం, పాడి పశువుల పెంపకం వంటి వాటిలో నిమగ్నమవుతారట.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్